నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమ ఎకౌంట్స్‌లో పది కోట్ల వరకూ గోల్ మాల్ జరిగిందని, దీనికి భాను ప్రకాష్ కారణమని ఆయన విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాను ప్రకాష్ గత అయిదేళ్లుగా పీవీపీ సంస్థలో కీలక వ్యక్తి. తను ఆడిటర్లతో కుమ్మక్కై.. పది కోట్లు సొంత జేబుల్లో వేసుకున్నట్టు పివీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి,.. భాను ప్రకాష్ నుంచి నిజాలు రాబట్టారు. భాను ప్రకాష్ నిజం ఒప్పుకుని, ఆ పది కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధపడడంతో కేసు వాపసు తీసుకున్నారు. నిజానికి కొన్ని రోజుల క్రిందట భాను ప్రకాష్ భార్య తన భర్త కనిపించకుండా పోయాడని విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటికే భాను ప్రకాష్ పీవీపీ మనుషుల అధీనంలో ఉన్నాడని, వాళ్లే భానుని పోలీసులకు అప్పగించారని తెలుస్తోంది.