కోడెల శివప్రసాదారావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వేధింపులు, అక్రమ కేసుల వ్యవహారాన్ని టీడీపీ … వ్యూహాత్మకంగానే… హైలెట్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతలు అనూహ్యంగా.. కోడెల ఆత్మహత్య ఘటనపై…తెలుగుదేశం పార్టీ వాదనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ టీడీపీపై సానుభూతిగా మాట్లాడని.. సోము వీర్రాజు వంటి నేతలు కూడా… అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ… మూడు నెలల కాలంలో.. కోడెల టార్గెట్ గా… వైసీపీ, సాక్షి మీడియా చేసిన ప్రచారాలు… పెట్టిన కేసులు… వాటి ద్వారా ఆయనను మానసికంగా ఎలా వేధించారోనన్న పూర్తి వివరాలతో ఓ డాక్యుమెంట్ తయారు చేసింది.
సాక్షి మీడియాలో..చేసిన ప్రచారం.. ఈ డాక్యుమెంట్ లో హైలెట్ కానుంది. దీన్ని తీసుకుని వెళ్లి… కిషన్ రెడ్డికి ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అయిన కిషన్ రెడ్డి.. టీడీపీ నేతలు కలవక ముందే… తన స్పందన తెలియచేశారు. కోడెల ఆత్మహత్య ఘటన అత్యంత బాధాకరణని… డీజీపీ, చీఫ్ సెక్రటరీ నుంచి వివరణ కోరతానని ప్రకటించారు. కిషన్ రెడ్డి అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. టీడీపీ నేతలు.. శివప్రసాదరావు ఎదుర్కొన్న వేధింపులపై ఆధారాలతో సహా వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు.. ఉదయం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని.. కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వాదిస్తున్నారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారు. బీజేపీ నేతలు కూడా.. ఇటీవలి కాలంలో.. టీడీపీ పట్ల సాఫ్ట్ గానే ఉంటున్నారు. వైసీపీపైనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై…ఏదో ఓ స్థాయిలో విచారణ జరగడం ఖాయమని.. అది కేంద్ర దర్యాప్తు సంస్థల ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.