తొలగింపునకు గురైన.. తన పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను… మళ్లీ పునరుద్ధరించేందుకు.. నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. #bringbackjspsocialmedia పేరుతో ఆన్ లైన్ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం ప్రారంభించారు. జనసేన పార్టీకి చెందిన 400 మంది క్రియాశీల కార్యకర్తలకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు హఠాత్తుగా… మాయమయ్యాయి. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ ఫైరయ్యారు. అసలు ఆ అకౌంట్లను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. సమస్యల్లో ఉన్న సామాన్యుల తరపున నిలబడి పోరాటం చేస్తున్నందుకు ఖాతాలను నిలిపివేశారా… దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
నల్లమల అడవుల్ని కాపాడాలంటూ… జనసేన అధినేత ఉద్యమం ప్రారంభించారు. జనసేన కార్యకర్తలంతా.. సేవ్ నల్లమల పేరుతో… ప్రచారం ప్రారంభించారు. వీరు చాలా దూకుడుగా.. ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో… సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ అయ్యాయి. దీనికి కారణం ఏపీ ప్రతిపక్ష పార్టీ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. దీని వెనుక చాలా పెద్ద స్థాయిలో కీలక వ్యక్తుల హస్తం ఉందని… జనసేన అనుమానిస్తోంది. సేవ్ నల్లమల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారితే..తట్టుకోలేమన్న ఉద్దేశంతో.. మొగ్గలోనే తెంచేయాలన్న ఉద్దేశంతో.. ట్విట్టర్ పై ఒత్తిడి తెచ్చి… ఫేక్ కంప్లైంట్లు ఇవ్వడం ద్వారానో.. అధికారంతో ఒత్తిడి చేయడం ద్వారానే.. నిలిపి వేయించారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో.. ఆ ఆకౌంట్లన్నింటినీ.. మళ్లీ వెనక్కి తెప్పించుకునే పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలోనే పోరాటం ప్రారంభించారు. అదే సమయంలో సేవ్ నల్లమల ఉద్యమాన్ని ఆపేది లేదని చెబుతున్నారు. తనకు నచ్చిన వనవాసి అనే పుస్తకాన్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.