సైరా ముందున్న పెద్ద సవాల్.. బాహుబలి. సైరా ఆ రికార్డుల్ని బద్దలు కొడుతుందా? లేదా? అని చిరంజీవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం అంత ఈజీ కాదు. ఈ విషయం సైరా బృందానికీ తెలుసు. అందుకే… రికార్డుల ప్రస్తావన వచ్చినప్పుడు చిత్రబృందం ఆచితూచి స్పందిస్తోంది.
సైరా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాహుబలి రికార్డుల ప్రస్తావన వచ్చింది. బాహుబలి రికార్డుల్ని సైరా బద్దలు కొండుతుందనుకుంటున్నారా? అనే ప్రశ్నకు దర్శకుడు సురేందర్ రెడ్డి కాస్త తెలివిగానే సమాధానం చెప్పాడు. “బాహుబలిని చూసి ఈసినిమా మొదలెట్టలేదు. మా నాన్నగారు చేసిన 151 సినిమాల్లో నా సినిమానెంబర్ వన్ గా ఉండాలి అనే చరణ్ సంకల్పబలంతో ఈసినిమా మొదలైంది. పదేళ్ల క్రితం తీయాల్సిన సినిమా ఇది. అప్పుడు తీసుంటే 1500 కోట్ల బడ్జెట్ అయ్యేదేమో. అంత పెట్టినా ఈ క్వాలిటీ వచ్చేది కాదు. ఇప్పుడు సాంకేతిక నైపుణ్యం పెరగడం వల్ల మా పని సులభం అయ్యింది” అని చెప్పుకొచ్చాడు.