దేవీపట్నం దగ్గర లాంచీ గల్లంతయిన ఘటనలో.. సంచలనాత్మక విషయాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. అసలు ఐదు లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పటికీ.. ఆ బోటును గోదావరిలోకి ఎలా అనుమతించారన్నదానిపై ఇప్పటికీ సందేహం అలాగే ఉంది. అయితే.. లాంచీ సర్వీసును నడపవద్దని… స్థానిక ఎస్సై బోటు నిర్వాహకుల్ని హెచ్చరించారని… అయితే మంత్రి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో.. ఏం చేయలేక వెళ్లనిచ్చారని.. విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన బోటులో … 93 ఉన్నారని ఆయన అంటున్నారు. పర్యాటకుల సంఖ్యను కూడా తక్కువ చేసి చెబుతున్నారని.. బోటును బయటకు తీసే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే… తీయడం లేదని హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
నిన్నటిదాకా బోటు ఎక్కడ ఉందో తెలియదన్నట్లుగా అధికారులు చేసిన ప్రచారం తప్పని.. సోమవారమే.. కనిపెట్టారని… కానీ తెలియనట్లు నటించారని అంటున్నారు. ప్రమాదంపై విచారణకు సీనియర్ అధికారిని నియమించాలని హర్షకుమార్ డిమాండ్ చేస్తున్నారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణ విశాఖకు చెందిన వ్యక్తే. బోటు ప్రమాదం జరిగినప్పటి నుండి ఆయన పరారీలో ఉన్నారు. పట్టుకునే ప్రయత్నాలు సీరియస్ గా చేయలేదు. అదే సమయంలో… మంత్రి అవంతి శ్రీనివాస్… మొట్టమొదటగా.. ఈ ప్రమాదం గురించి తెలిసిన తరవాత చేసిన ఆరోపణ.. ఆ బోటుకు టీడీపీనే అనుమతి ఇచ్చిందని. ఎవరైనా … ముందుగా… బాధ్యతగల మంత్రిగా సహాయ చర్యల గురించి ఆలోచిస్తారు కానీ… మంత్రి మాత్రం.. టీడీపీ అనుమతి ఇచ్చిందని… తమ తప్పేం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
తాను ఫోన్ చేయడం వల్లే బోటు కదిలిందనే విషయం బయటపడుతుందనే… అవంతి ఇలాంటి విమర్శలు చేశారని… టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోటు ప్రమాదం ఘటనలో ఇప్పటికీ… అసలు తప్పెవరిదో ప్రభుత్వం తేల్చే ప్రయత్నం చేయలేదు. కమిటీలు.. మెజిస్టిరియల్ విచారణల ప్రకటనలు మాత్రం వచ్చాయి. కానీ బోటు యజమానిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు.. మంత్రి అవంతి శ్రీనివాస్ పేరే బయటకు రావడంతో దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.