అక్రమాస్తుల కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ.. జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై… సీబీఐ కోర్టు విచారణ జరపడానికి అంగీకరించింది. రెండు వారాల క్రితం… జగన్మోహన్ రెడ్డి తనకు బదులుగా న్యాయవాది హాజరవుతారని.. అనుతమించాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు అసలు విచారణ అర్హత ఉందా లేదా.. అన్నదానిపై… ఈ శుక్రవారం వాదనలు జరిగాయి. గతంలో… వ్యక్తిగత మినహాయింపు కోరుతూ… హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను .. కొట్టి వేసినందున.. ఇప్పుడు మళ్లీ ఎలా పిటిషన్ ను విచారించాలని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. అయితే.. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని … వివరిస్తూ… జగన్ తరపు లాయర్.. తన వాదనలు వినిపించారు.
జగన్ వాదనలు విన్న న్యాయమూర్తి… వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణకు అంగీకారం తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యానని.. తాను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలంటే.. చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని.. ఏపీ ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదని… తాను రావడం వల్ల మరింత భారం పడుతుందని.. ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణలోనూ ఇబ్బందులు ఎదురవుతాయని.. జగన్ .. వ్యక్తిగత హాజరు కోసం దాఖలు చేసిన మినహాయింపు పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం లేదు. సాధారణంగా ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి.
తనకు వ్యక్తిగత మినహాయింపు కావాలని.. ఆయన కోరుతున్నారు. అందుకు తన ముఖ్యమంత్రి పదవినే కారణంగా చూపిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా… పాదయాత్ర ప్రారంభించే ముందు… వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ… సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఇవ్వలేదు. హైకోర్టుకూ వెళ్లారు. అక్కడా ఊరట దక్కలేదు. దాంతో వారం వారం.. పాదయాత్ర నుంచి కోర్టుకు వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో సారి మినహాయింపు కోరుతున్నారు.