సీఆర్డీఏ లేక ముందు.. సీఆర్డీఏ చట్టం రాక ముందు… సీఎర్డీఏ అనే ప్రతిపాదన లేనప్పుడు… కరకట్టపై అన్ని రకాల అనుమతులతో తాను ఇల్లు కట్టుకున్నానని… ఇప్పుడు సీఆర్డీఏ చట్టం పేరుతో.. తన ఇంటికి నోటీసులు సరి కాదని.. చంద్రబాబు ఉంటున్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు.. ఆయన ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి.. స్విమ్మింగ్ ఫూల్కి కూడా.. అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. శనివారం ఉదయం తెల్లవారే సరికి… చంద్రబాబు ఇంటికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. ఆ ఇంటిని అక్రమ కట్టడంగా నిర్ణయించామని.. మీరు కూల్చేయకుంటే.. మేమే కూల్చేస్తామని.. ఆ నోటీసుల సారాంశం. సీఆర్డీఏ చట్టం ప్రకారం ఈ నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులు చూసి టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ.. ఎవరూ స్పందించవద్దని.. ఆ పార్టీ నేతలకు స్పష్టమైన సమాచారం పంపేశారు. ఈ నోటీసుల వెనుక.. ప్రభుత్వ అసలు లక్ష్యం వేరే ఉందని.. ఆ లక్ష్యాన్ని నెర వేర్చకూడదన్నది టీడీపీ నేతల ఆలోచన. టీడీపీ నేతలు చెబుతున్న ప్రభుత్వ లక్ష్యం ఏమిటంటే… టాపిక్ డైవర్షన్. ప్రస్తుతం.. ప్రభుత్వాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. బోటు ప్రమాదం, గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష పేపర్ల లీక్ అంశాలపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. బోటుప్రమాదంలో బోటును తీయలేకపోవడం… సహాయచర్యలు నిలిపివేయడంతో… బాధితుల్లో ఆక్రోశం కనిపిస్తోంది. అదే సమయంలో… ఇరవై లక్షల మంది.. ఉద్యోగార్థుల్లో.. తాము మోసపోయామనే భావన కనిపిస్తోంది. పేపర్ లీకేజీ కారణంగా.. తమ కష్టం అంతా.. బూడిదలో పోసిన పన్నీరయిందని.. ఉద్యోగార్థులు ఆవేశ పడుతున్నారు.
మీడియా ఒక్క సారిగా.. చంద్రబాబు ఇంటి వైపు అటెన్షన్ తీసుకుంటే… ఆ సమస్యల నుంచి పక్కదారి పట్టించవచ్చని అనుకుంటున్నట్లుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే.. స్పందించడానికే కాదు.. ఆ నోటీసుల్నే లైట్ తీసుకుంటున్నారు. ఇంటికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని…. ఇంటి యజమాని లింగమనేని రమేష్ ఓ ప్రకటన చేసి.. సరి పెట్టారు. దాంతో.. ప్రభుత్వం, వైసీపీ ప్రయత్నం విఫలం చేయగలిగామని… టీడీపీ నేతలంటున్నారు. అయితే.. చంద్రబాబు ఉంటున్న ఇంటితో పాటు.. మరో నాలుగు ఇళ్లకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం తర్వాత కూలగొడతారన్న ప్రచారం జరుగుతోంది.