ఏపీ ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ వ్యవహారాలను… పర్యవేక్షిస్తున్న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదిత్యనాథ్ దాస్.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్నారు. వైఎస్ హయాంలోనూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన… నిబంధనలను అతిక్రమించి ఇండియా సిమెంట్స్ కు నిబంధనలు అతిక్రమించి నీటి కేటాయింపులు జరిపారు. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఈ కేటాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్ సంస్థ రూ.140 కోట్లు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయనే సాంకేతిక కారణాలతో ఈ కేసును మూడేళ్ల కిందటే కోర్టు తోసిపుచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసు నుంచి… హైకోర్టు మినహాయింపు ఇవ్వడాన్ని సీబీఐ సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆదిత్యనాథ్ దాస్ కు నోటీసులు జారీ చేసింది. అప్పటి వైఎస్ హయాంలలోలా.. ఇప్పుడు.. జగన్ హయాంలోనూ.. ఆదిత్యనాథ్ దాస్… జలవనరుల విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలోనూ.. ఆయనదే కీలక పాత్రని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోవరానికి సంబంధించి కేంద్రంతో.. చర్చలకు ఆయనే ఢిల్లీ వెళ్తున్నారు. అయితే.. కేంద్రం మాట వినకుండా… నిపుణుల కమిటీ పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి.. పీపీఏపై నిందలేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి.
నిపుణుల కమిటీ నివేదికపై… పీఎంవో.. వివరణ అడగడంతో.. ఆ కమిటీ నివేదికతో ఏకీభవించడం లేదని.. పోలవరంలో తప్పులు జరగలేదని మరో నివేదిక పంపారు. అయినప్పటికీ.. రివర్స్ టెండిరింగ్ కు ముందుకే వెళ్తామని కేంద్రానికి చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లోసీబీఐ ఇక యాక్టివ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయని ఆదిత్యనాథ్ దాస్ కేసును.. పరిశీలించిన న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.