పోలవరం ప్రాజెక్ట్ లోని రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకివచ్చాయి. రివర్స్ టెండర్ల ద్వారా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ లో 65వ నెంబర్ ప్యాకేజీ కింద టన్నెల్, నేవీగేషన్ కెనాల్ కు టెండర్లను రెండో సారి మ్యాక్స్ ఇన్ ఫ్రా.. రూ. 48 కోట్లకు తక్కువకుపనులు చేస్తామని తీసుకుంది. అంతకు ముందు కూడా ఈ కంపెనీ తీసుకున్నా పనులు చేయలేదు. నిజానికి ఇదే పనికి 2005లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అప్పట్లో ఈ పనులకు ఇనీషియల్ బెంచ్ మార్క్ ను రూ. 358.51 కోట్లుగా నిర్ణయించారు. అంటే.. పదిహేనేళ్ల క్రితమే.. ఈ పనుల విలువ రూ. 358.51 కోట్లు. ఈ పనులను చేపట్టేందుకు కాంట్రాక్ట్ సంస్థకు టెండర్లు కూడా అప్పగించారు. ఈ సంస్థ 15 కోట్ల రూపాయల మేర పనిచేసింది. మట్టి పనులు మాత్రమే చేసి చేతులెత్తేసి వెళ్లిపోయింది. ు
అప్పటికి మగిలిన విలువ రూ. 343.49 కోట్లు. ఆ పనులకు సంబంధించి మళ్లీ 2019 జనవరి 28వ తేదీన చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. గతంలో మిగిలిపోయిన పనుల విలువ రూ. 349 కోట్ల రూపాయలను మరోసారి క్షేత్రస్థాయికెళ్లి పరిశీలించి ఇనీషియల్ బెంచ్ మార్క్ ను కూడా సవరించాలని గతంలో చంద్రబాబు సర్కార్ సూచించింది. అధికారులు వేసిన అంచనా, సవరించిన అంచనాల మేరకు రూ. 276 కోట్ల రూపాయలుగా ఈ అంచనా వచ్చింది. అంటే.. వైఎస్ ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా 82 కోట్ల రూపాయలు తక్కువన్నమాట. మ్యాక్స్ ఇన్ ఫ్రా 4.77 శాతం ఎక్కువకు టెండర్లేయడం వల్ల బిడ్ విలువ 290 కోట్ల రూపాయలకు చేరింది. మ్యాక్స్ ఇన్ ఫ్రా చేపట్టిన పనుల విలువ కేవలం 2 కోట్ల 55 లక్షలు మాత్రమే. ఇప్పుడు అదే సంస్థకు … కాంట్రాక్టు ఇస్తున్నారు.
అంటే వైఎస్ హయాంలో.. పదిహేనేళ్ల కిందట.. టన్నెల్, నేవిగేషన్ కెనాల్ల పనుల వ్యయం రూ. 359 కోట్లుగా ఉండగా… పదిహేనేళ్ల తర్వాత ఆయన కుమారుడు జగన్ దగ్గరకు వచ్చే సరికి.. అది రూ. 230 కోట్లకు చేరింది. పని మాత్రం ఒక్క శాతమే అయింది. సహజంగా.. ఏళ్లు గడిచే కొద్దీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దానికి తగ్గట్లుగా.. ఖర్చులూ పెరుగుతాయి. కానీ ఇందులో అసలు గూడుపుఠాణి మాత్రం.. మొత్తాన్ని తగ్గించేసింది. పోలవరం హెడ్ వర్క్స్ కు సంబంధించి… రివర్స్ టెండర్ల ప్రక్రియ ముందుకు సాగే కొద్దీ.. మరింత ప్రజాధనాన్ని ఆదా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ముందు ముందు మరెన్ని సిత్రాలో చూడాలో..!