తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్లోనే ఏస్తుక్రీస్తు బోధనల పుస్తకాలను అప్ లోడ్ చేసిన వ్యవహారం బయట పడింది. టీడీ వెబ్సైట్లో సకల దేవతా స్తోత్రాల పేరుతో.. అప్లోడ్ చేసిన పుస్తకాల్లో ఏసు కీర్తనలు కూడా ఉండడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఎంవీఆర్ శాస్త్రి గుర్తించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాసేపటికే ఈ వ్యవహారం సంచలనం అయింది. వెంటనే.. టీటీడీ గుర్తించి.. ఆ పుస్తకాన్ని తొలగించినట్లుగా ప్రకటించింది. అన్యమత ప్రచారం చేయడం నేరం అయిన టీటీడీలోనే… ఏకంగా ఏస్తుక్రీస్తు బోధనలు.. అప్ లోడ్ చేయడం.. ఆషామాషీగా జరిగింది కాదని భక్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. అది టీటీడీ ముద్రించిన పుస్తకం కాదని… టీటీడీ వెబ్సైట్లో మేం ముద్రించిన పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు ఉన్నాయని.. వాటిని తొలగిస్తున్నామని ప్రకటించారు. మొత్తం 4 వేల పుస్తకాలను చెక్ చేసిన తర్వాతే అప్లోడ్ చేస్తామని ప్రకటించారు.
కొద్ది రోజులుగా.. తిరుమలలో.. అనేక మంది.. హిందూయేతరలు ఉద్యోగాలు చేస్తున్నారని చెబుతున్నారు. సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి దగ్గరి బంధువు క్రిస్టోఫర్ టీటీడీకి చెందిన విద్యాసంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. మరికొంత మంది రెగ్యులర్ గా చర్చికి వెళ్లే ఉద్యోగులు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. తిరుమలలో అన్యమత ప్రచారం… చాపకింద నీరులా సాగుతోందని.. దానికి.. పాలక వర్గాల ప్రోత్సాహం ఉందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లో పుస్తకాలను అప్ లోడ్ ను ఆషామాషీగా చేయరు. పూర్తిగా పరిశీలించిన తర్వాతే చేస్తారు.
నిజానికి అప్ లోడ్ చేసిన పుస్తకంలో… క్రీస్తు బోధనలు లేవని… కానీ.. ఎవరో కుట్ర పూరితంగా.. పీడీఎఫ్ ఫార్మాట్లో వాటిని ఇరికించి అప్ లోడ్ చేశారని… ఎంవీఆర్ శాస్త్రి చెబుతున్నారు. పుస్తకంలో ఆ పేజీలకు సీరియల్ నెంబర్లు లేకపోవడమే దానికి సాక్ష్యం అంటున్నారు. అయితే.. ఇది 2002లోని పుస్తకమని.. అప్ లోడ్ చేసేటప్పుజే.. పథకం ప్రకారం ఇరికించారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఓ వైపు .. జంబో పాలక మండలి సమావేశం జరుగుతూండగానే.. ఈ వ్యవహారం వెలుగు చూడటం… భక్తుల్లోనూ అలజడి రేపుతోంది. అయితే తప్పు ఎలా జరిగిందో ఆలోచించకుండా.. తొలగిస్తామని చెప్పి ఈవో సరి పెట్టారు.