పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో ఏపీ సర్కార్ కు హైకోర్టు నుంచి మొట్టికాయ పడింది. ఈ అంశానికి సంబందించి విడుదల చేసిన జీవోలను కొట్టి వేసింది. కంపెనీలకు నిలిపివేసిన విద్యుత్ బిల్లులన్నింటినీ చెల్లించాలని ఆదేశించింది. విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేసిన వాటిపైనా.. ఇక నుంచి కొనుగోళ్లు జరపాలని స్పష్టం చేసింది. ఏ వివాదాపైనా.. ఏపీఈఆర్సీ వద్దకు వెళ్లి తేల్చుకోవాలని.. ఆరు నెలల్లో సమస్యను పరిష్కారించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పీపీఏలను రద్దు చేయాలని.. .శతవిథాలా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. తలబొప్పి కట్టింది కానీ… ప్రయోజనం మాత్రం లభించలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించిన మొదటి టార్గెట్ పీపీఏలు. అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు. వీటిల్లోవేల కోట్ల అవినీతి జరిగిందని.. సమీక్షించి రద్దు చేసి.. తాము వేల కోట్లు మిగిలిస్తామని ప్రమాణస్వీకార వేదిక నుంచే ఘనంగా ప్రకటించారు. కమిటీ నియమించారు. బిల్లులు చెల్లించడం ఆపేశారు. కరెంట్ కొనుగోళ్లు కూడా నిలిపివేశారు. దీంతో.. కంపెనీలు పవర్ ట్రిబ్యునల్‌తో పాటు.. హైకోర్టులోనూ పిటిషన్లు వేశాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న దాదాపు 40 విద్యుత్ సంస్థలు.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో సమీక్షా కమిటీల్ని.. వీటికి సంబంధించిన జీవోలపై హైకోర్టు స్టే విధించింది. కేంద్రమంత్రి ఆర్కే సింగ్ కూడా తీవ్రమైన హెచ్చరికలే చేశారు. ఇప్పటికి కోర్టు కూడా.. ఆ నిర్ణయాలను పూర్తి స్థాయిలో కొట్టి వేసింది.
విద్యుత్ కంపెనీలకు.. ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు ఉంది. హైకోర్టు ఆదేశంతో ఇప్పటికిప్పుడు.. వాటిని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీపీఏల్లో అవినీతి జరిగిందని.. నిరూపిస్తామని.. సవాల్ చేసిన ఏపీ సర్కార్.. జగన్మోహన్ రెడ్డి .. ఇప్పుడు.. అందులోనూ అవినీతి జరగలేదని… తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పటికైనా.. ఏపీ సర్కార్ కోర్టు , కేంద్రం ఆదేశాలతో ముందుకెళ్తుందో.. మరో స్టెప్ వేస్తుందో. .. వేచి చూడాలి..!