ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ… బీజేపీకి వ్యతిరేకంగా ఓ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గోదావరి జలాల సద్వినియోగం, విభజన సమస్యలపైనే.. ముఖ్యమంత్రులు చర్చిచారని.. రాజకీయాలు చర్చించలేదని.. వైసీపీ చెప్పుకొచ్చింది. కావాలనే.. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నామని… ప్రతిపక్ష అనుకూల మీడియా ప్రచారం చేస్తోందని.. విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై… తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఎలాంటి ఖండన వ్యక్తం చేయలేదు. కానీ.. ఏపీలో వైసీపీ మాత్రమే ఉలిక్కి పడింది. బీజేపీ పెద్దలు ఏమైనా అనుకుంటామోనని.. వెంటనే.. ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.
గోదావరి జలాలను శ్రీశైలానికి తరరించే విషయం, విభజన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అంశాలపై ముఖ్యమంమత్రులు చర్చలు జరిపితే.. కచ్చితంగా ఉన్నతాధికారులు ఉండేవారు. ఆయా శాఖలకు చెందిన మంత్రులు ఉండేవారు. జగన్ వెంట… కనీసం జలవనరుల మంత్రి అనిల్ కుమార్ కూడా లేరు. సమగ్ర సమాచారం.. పత్రాలు వారి వద్ద అందుబాటులో ఉంచే అధికారులు కూడా లేరు. కానీ.. ముఖ్యమంత్రుల సమావేశంలో.. ఏ అధికారి కూడా పాల్గొనలేదు. పైగా.. కేసీఆర్, జగన్ ముఖాముఖి సమావేశమైన చర్చలు జరిపారని చెబుతున్నారు. చాలా హైప్ క్రియేట్ చేసినప్పటికీ.. ముఖ్యమంత్రులు ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. ఏ ఏ అంశాలపై చర్చించారో చెప్పలేదు. సమావేశం ముగిసిన తర్వాత జగన్… లోటస్ పాండ్ వెళ్లిపోయారు.
ఇదే అంశాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. బీజేపీతో టీఆర్ఎస్, వైసీపీకి కోల్డ్ వార్ నడుస్తోందని.. విషయం బయట పడేసరికి.. భుజాలు తడుముకుంటున్నారని..విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రగతి భవన్ లో … బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్నదానిపైనే చర్చలు జరిగాయని.. యనమల స్పష్టం చేశారు. కాదంటే..ఎజెండా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి దేవినేని ఉమ… జలవనరుల మంత్రి లేకుండా… కేసీఆర్, జగన్ గోదావరి జలాల తరలింపుపై .. ఎలా చర్చలు జరిపారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రుల సమావేశం అధికారికం అయితే.. ఆ వాతావరణం వేరుగా ఉండేది… కానీ..రాజకీయం.. కాబట్టే… ఉలిక్కి పడుతున్నారని… టీడీపీ వర్గాలు సెటైర్లు ప్రారంభించాయి.