మేఘా ఇంజినీరింగ్ కంపెనీ.. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన కంపెనీ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. వెంట పడి మరీ.. రూ. లక్షల కోట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టులు.. కట్టబెడుతున్నాయి. రివర్స్ టెండర్లు వేసి మరీ.. మేఘా కంపెనీకి.. కాంట్రాక్టులు ఇస్తున్నాయి. తాజాగా.. ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్న మేఘా ఓనర్లు.. పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు.. తెలుగు రాష్ట్రాలకు.. అంబానీలుగా మారిపోయారు. అంటే.. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా.. సంపద ఉన్న… కుబేరులుగా.. ప్రసిద్ధి పొందుతున్నారు. మేఘా చైర్మన్ పీపీరెడ్డి ఆస్తులు రూ.13,400 కోట్లు. మేఘా ఎండీ పీవీకే రెడ్డి ఆస్తులు రూ.12,900 కోట్లు. ఈ విషయాన్ని ఇండియా ఇన్ఫో లైన్ అనే సంస్థ.. వెల్లడించింది.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ 1989లో ఓ చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్ ను ప్రారంభించడం ద్వారా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టులు చేపట్టింది. 2006 నుంచి ఆ కంపెనీ దశ తిరిగిపోయింది. మెగా ఇంజినీరింగ్ ప్రయివేట్ లిమిటెడ్గా మారిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులను… సొంతం చేసుకోవడం ప్రారంభించింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. వివాదాలు లేకుండా.. పనులు పూర్తి చేసుకోవడంలో.. కంపెనీ యాజమాన్యం దిట్ట. మౌలికవసతులు, నిర్మాణ రంగంలోని దిగ్గజ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. మేఘా సంస్థ యాజమాన్యం అటు పనితీరుతోనూ.. ఇటు.. పాలకులతో సత్సంబంధాలు కొనసాగించడంలోనూ.. మెరుగైన ప్రతిభ కనబర్చడంతో… కుబేరులుగా అవతరించారు.
అయితే ఇటీవలి కాలంలో మేఘా ఒత్తిడిని ఎదుర్కోంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం.. ఏ పోలవరం పనులకైతే.. రూ. 300 కోట్లు ఎక్కువకు కావాలని.. టెండర్ వేశారో.. ఇప్పుడు అదే పనులకు.. రూ. 700 కోట్లు డిస్కౌంట్ ఇచ్చి పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో.. ఇతర చోట్ల పని చేస్తున్న కాంట్రాక్టుల్లోనూ.. రివర్స్ టెండర్లకు వెళ్లాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు.. ఆ కంపెనీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటే.. కష్టపడి సాధించిన పేరు అంతా.. బూడిదలో పోసిన పన్నీరవుతుందని.. మేఘా వర్గాలు ఆందోళనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.