మధ్యప్రదేశ్ మహిళల హనీట్రాప్‌లో మధ్యప్రదేశ్ అధికారులు, నేతలు మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల “కక్కుర్తి” రాజకీయ నేతలు కూడా పడ్డారు. ఓ మహారాష్ట్ర మంత్రి. కర్ణాటక సీనియర్ నేత. తెలుగు రాష్ట్రాల నేతల ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయన్న విషయం కలకలం రేపుతోంది. అందాన్ని ఎరగా వేసి.. నేతల్ని, బ్యూరోక్రాట్లను ముగ్గులోకి దింపి.. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న కిలేడీల ముఠా అరెస్ట్‌తో దేశవ్యాప్త సంచలనం కలుగుతోంది.
వాళ్ల దగ్గర లీడర్లు, ఆఫీసర్ల ఐదు వేల రాసలీలల వీడియోలు..!
మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన ముఠా సామాన్యమైన ముఠా కాదు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి.. స్వాధీనం చేసుకున్న ల్యాప్ ట్యాబ్‌లు, ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను చూస్తే..అందులో ఐదు వేలకుపైగా వీడియో ఫైల్స్ ఉన్నాయి. అవన్నీ.. రొటీన్ .. బ్లూ ఫిల్మ్ క్లిప్స్ కావు. సీక్రెట్‌గా తాము ట్రాప్ చేసి… లాగిన అధికారులు, రాజకీయ నేతల వీడియోలు. అందులో ఎక్కడా.. ఆ మహిళలు తమ మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం… తమతో రాసలీలల కోసం కక్కుర్తి పడి.. ట్రాప్‌లో ఇరుక్కున్న అధికారులు, రాజకీయ నేతల ఫోటోలు, వీడియోలు మాత్రమే కనిపించేలా ఎడిట్ చేశారు. ఇప్పుడవి.. మధ్యప్రదేశ్ పోలీసుల చేతిలో ఉన్నాయి. పేర్లు, ఊళ్లు బయటకు రాకుండా… సీక్రెట్‌గా విచారణ జరుపుతున్నారు.
మహారాష్ట్ర మంత్రి..! లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాల నేతలు కూడా..!?
మహారాష్ట్రకు మంత్రి శంభాజీరావు నీలంగేకర్ ఆ వీడియోల్లో ఉన్నారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు మాత్రం ఎవరి పేరునూ బయట పెట్టలేదు. కానీ.. హనీ ట్రాప్ ముఠా.. ఒక్క మధ్యప్రదేశ్‌కే పరిమితం కాలేదని.. వారిని ఉపయోగించుకుని… ఎక్కడ కక్కుర్తి రాజకీయ నాయకులు.. అధికారులు ఉంటే.. అక్కడ వాలిపోయారని తెలుస్తోంది. వీరి వలలో పడిన వారిలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా… ఇలాంటి వాటికి ఆకర్షితులయ్యే సీనియర్ బ్యూరోక్రాట్లు, లీడర్లను టార్గెట్ చేసి మరీ.. ట్రాప్‌లో పడేశారని.. వారి వీడియోలు కూడా.. ఉన్నాయని మధ్యప్రదేశ్ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడి నేతల్ని మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తుపట్టడం కష్టం. అందుకే.. ఆ వీడియోల్లో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా ఉన్నారా.. అనే దిశగా.. కొంత మందిని ప్రత్యేకంగా పిలిపించుకుని పరిశీలన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఓ నేత పట్టాయా ట్రిప్ వీడియో ఆ కోణంలోనే బయటకు వచ్చిందా..?
తెలుగు రాష్ట్రాలకు చెంది.. ఓ కీలక పొజిషన్లో ఉన్న ఓ నేత… జల్సాల నగరం పట్టాయాలో షికార్లు చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టింది. అది ఎలా బయటకు వచ్చిందో చాలా మందికి అర్థం కాలేదు. కానీ.. బ్లాక్ మెయిలింగ్ లో భాగంగానే అది వచ్చిందని.. అంతకు మించిన వీడియోలున్నాయన్న అర్థంతో… బ్లాక్ మెయిలింగ్ కోసం.. అలా చేశారన్న ప్రచారం ఇప్పుడు ప్రారంభమయింది. అంతే.. తెలుగు రాష్ట్రాల నేతల్లో… పైకి కనిపించని స్త్రీలోలులు చాలా మంది ఉన్నారు. కాంట్రాక్టర్లు, ఇతర పనులు కావాల్సిన వాళ్లు.. వారికి.. ఆ ఆరెంజ్మెంట్లు చేస్తారు. ఈ మధ్యప్రదేశ్ ముఠా తో అలాంటి వారికి టచ్ ఉండటంతో.. ఇప్పుడు.. నిండా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే.. అలాంటి పనులు చేసి .. తెలుగు రాష్ట్రాల నేతల గుండెల్లో గుబులు కనిపిస్తోంది. ఆ వీడియోలు బయటకు రాకూడదని.. కోరుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.