టాలీవుడ్‌కి హారర్ సినిమాల రుచి చూపించిన వాళ్లలో రవిబాబు కూడా ఒకడు. `అవును` సినిమాతో… రవిబాబు అలరించాడు. `అవును 2` బాగా నిరాశ పరిచింది. అయితే ఈసారి కాస్త విరామం తీసుకుని `ఆవిరి` రూపొందించాడు. ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా చేయి కలపడంతో `ఆవిరి`పై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ఆవిరి టీజర్ విడుదలైంది.
ఎప్పట్లా ఓ బంగ్లాలో జరిగే కథ ఇది. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ తో టీజర్‌ని కట్ చేశాడు. టీజర్ ఆసక్తికరంగానేఉన్నా – రవిబాబు తీసిన `అవును` ఛాయలు పుష్కలంగా కనిపిస్తూనే ఉన్నాయి. గాలి రూపంలో ఉన్న దయ్యం.. ఎవరూ లేకుండానే వస్తువులు కదలడం – ఈ ట్రిక్కులన్నీ `అవును`లో కనిపించాయి. రవిబాబు స్పెషాలిటీ ఏమిటంటే… దెయ్యాలేం కనిపించవు. కేవలం ఆ తాలుకు భయం మాత్రమే ఈ కథల్ని నడిపిస్తుంటాయి. అలాంటి ప్రయత్నమే ఇందులోనూ జరిగి ఉండొచ్చు. మేకింగ్, కలర్స్, ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ బాగానే కనిపిస్తున్నాయి. రవిబాబు ఎంట్రీ కూడా మిస్సవ్వలేదు. మొత్తానికి హారర్ సినిమాల్ని ఇష్టపడేవాళ్లకు ఓ ట్రీట్‌లా ఉండబోతోందన్న ఫీలింగ్ కలిగింది. ఈ సిరీస్‌లో మరో రెండు టీజర్లు రాబోతున్నాయి. అవి రెండూ చూశాకే.. `అవిరి`పై ఓ అంచనాకు రావొచ్చు.