ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్ బస్సుల టెండరింగ్ వ్యవహారం.. ఎండీగా ఉన్న సురేంద్రబాబును రాత్రికి రాత్రే బదిలీ చేయడం వంటి అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. అయితే.. బస్సుల డీల్స్‌కు … టీడీపీ నేత వర్ల రామయ్య అడ్డు పడతారనే సందేహం.. ప్రభుత్వంలో ప్రారంభమయింది. దీనికి కారణం ఇప్పటికీ.. వర్ల రామయ్యే ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు. వర్ల రామయ్యను గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నియమించారు. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఆర్టీసీ కార్యాలయం వైపు వెళ్లలేదు. అయినప్పటికీ.. ఆయన సాంకేతికంగా ఆర్టీసీ చైర్మన్ గానే ఉన్నారు. ఇప్పుడు.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లు ఖరారు చేయాలంటే.. ఆయన సంతకం తప్పనిసరి అని చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్ టెండర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో.. ఆయన సహకరించే అవకాశమే లేదు. అందుకే.. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతో పదవీకాలం ముగిసిందని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే… పదవి కాలం విషయంలో.. ప్రభుత్వానికి సందేహం ఉందేమో కానీ.. నెల రోజుల్లోపు ఆయన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. పదవీ కాలం ముగిస్తే.. మళ్లీ రాజీనామా చేయమని అడగడం ఎందుకో… చాలా మందికి అర్థం కాలేదు. తాను ఆర్టీసీ ఆఫీసుకు రావడం లేదని.. అలాగని.. రాజీనామా చేయలేదని.. ప్రభుత్వం తొలగిస్తే.. తొలగించుకోవచ్చని.. ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
టీడీపీ హయాంలో నియమితులైన వారిలో చాలా మంది స్వచ్చందంగా రాజీనామాలు చేశారు. కొంత మంది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు మాత్రం… కొనసాగుతున్నారు. వారిని తప్పించడానికి ప్రభుత్వ ప్రయత్నాలు సరిపోవు. అందుకే సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వర్ల రామయ్య ఇష్యూ కూడా… ఎలా సాల్వ్ చేసుకోవాలా అని.. ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. అయితే.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి రాజ్యాంగబద్ధమైనది కాదు. కానీ తొలగించాలంటే మాత్రం కొన్ని రూల్స్ పాటించాలి.