కన్నా లక్ష్మినారాయణను టీడీపీ ఏజెంట్‌గా ప్రచారం చేయడం ప్రారంభించింది.. వైసీపీ. ఆ పార్టీ అధికార మీడియా సాక్షి. ఆ పార్టీ నేతలు.. కన్నాకు టీడీపీతో లింక్ పెట్టి… విమర్శలు చేయడం.. దాన్ని ప్రత్యేక కథనాల రూపంలో.. సాక్షి ప్రసారం చేయడం కామన్‌గా మారిపోతోంది. కన్నా లక్ష్మినారాయణపై ఆంధ్రప్రదశ్ అధికార పార్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక విధానం దగ్గర్నుంచి పోలీసుల పాలన వరకూ.. కన్నా లక్ష్మినారాయణ తన విమర్శలను ఏ మాత్రం.. కంట్రోల్ లో ఉంచుకోవడం లేదు. ఇతర బీజేపీ నేతల్లో కొంత మందికి… జగన్మోహన్ రెడ్డిపై సానుభూతి ఉంది. వారు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ.. కన్నా మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో.. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలనే… కన్నా లక్ష్మినారాయణ చేస్తున్నారని.. ఆయన స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసు దగ్గర్నుంచి వస్తోందా.. అని వైసీపీ నేతలు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం… కన్నా లక్ష్మినారాయణ గవర్నర్ .. బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి.. ఏపీ సర్కార్ పై ఫిర్యాదు చేశారు. ఇసుక కొరత లేకుండా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారని.. ప్రభుత్వ నిర్వాకం వల్ల వారంతా ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు. ఇలా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం… వైసీపీకి నచ్చలేదు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే… కన్నా చేస్తున్నారని.. ఎదురుదాడి ప్రారంభించారు. కానీ.. కన్నా చేసిన ఆరోపణలు.. నిజమో కాదో మాత్రం చెప్పడానికి అంగీకరించలేదు.
నిజానికి కన్నా లక్ష్మినారాయణకు… చంద్రబాబు అంటే.. ఎంత అయిష్టతో.. ఆయన రాజకీయాలను పరిశీలించేవారికి సులువుగనే అర్థం అవుతుంది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడంలో కన్నా ముందుండేవారు. ఎన్నికలకు ముందు… వైసీపీలో చేరేందుకు కన్నా సిద్ధమయ్యారు. అమిత్ షా జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు. ఇప్పుడు.. బీజేపీ విధానం ప్రకారం… వైసీపీ తప్పుల్ని ఎత్తి చూపుతూండటంతో.. కన్నా.. వైసీపీకి కంటగింపుగా మారారు. పదవిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారని సెటైర్లు ప్రారంభించారు. మొత్తానికి.. వైసీపీని ఎవరు విమర్శించినా.. వారిని టీడీపీ ఖాతాలో వైసేయడం.. వైసీపీకి కామన్‌గా మారిపోయింది.