పల్నాడులో ఎక్కడా దివంగత కోడెల శివప్రసాదరావు విగ్రహాలు కూడా కనబడకూడదని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందా..? అంటే.. అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. కోడెల విగ్రహ స్థాపన కోసం.. రెడీ చేసిన దిమ్మెను పోలీసులు గ్రామాల్లోకి వచ్చి మరీ కూలగొట్టడంతో.. ఈ విషయం వివాదాస్పదం అవుతోంది. కోడెల దశదినకర్మ నర్సరావుపేటలో జరిగింది. చంద్రబాబుతో సహా… టీడీపీ ముఖ్యనేతలంతా.. ఈ కార్యక్రమానికి హాజరై.. కోడెలకు నివాళులర్పించారు. అందరూ.. చనిపోయిన తర్వాత కూడా కోడెలపై ఏపీ సర్కార్ కక్ష సాధిస్తోందని.. మండిపడ్డారు. దానికి సాక్ష్యమే.. విగ్రహాలను కూడా ఏర్పాటు చేయకుండా.. అనుమతుల పేరుతో.. దిమ్మెలను కూల్చివేయడమని మండి పడుతున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో కోడెల విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన దిమ్మెను.. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు కూలగొట్టారు. దాంతో విగ్రహావిష్కరణ నిలిచిపోయింది.
ఈ విషయాన్నే టీడీపీ నేతలందరూ.. నివాళి కార్యక్రమంలో గుర్తు చేశారు. చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం కోడెలను వదిలి పెట్టడం లేదని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం.. ఎక్కడి పడితే.. ఎక్కడ…విగ్రహాలు నెలకొల్పారని.. వాటికి ఎవరి అనుమతులు తీసుకున్నారని.. టీడీపీ నేతులు ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా పెట్టిన వేల విగ్రహాల్లో ఒక్క దానికంటే.. ఒక్కదానికి అనుమతి లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు.. కోడెల విషయంలోనే ఎందుకు.. ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
చూస్తూంటే.. ప్రభుత్వం కూడా.. కోడెలకు సంబంధించి.. ఎలాంటి విగ్రహాలు కూడా.. ఉండకూడదన్న ఉద్దేశంతో అధికారులకు ఆదేశాలిచ్చినంట్లుదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే… ప్రైవేటు స్థలాల్లోనే.. కోడెల విగ్రహాలు పెడతామని.. ఎవరు అడ్డొస్తారో చూస్తామని… మహిళా నేత నన్నపనేని రాజకుమారి సవాల్ చేశారు. ఈ విగ్రహాల అనుమతుల వ్యవహారం ముదిరి పాకాన పడే అవకాశం కనిపిస్తోంది.