ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను సాక్షి పత్రిక గరిష్ట స్థాయిలో లబ్ది పొందతోంది. ఇప్పటికే సాక్షి నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులకు ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చేందుకు… ఔట్ సోర్సింగ్ ద్వారా.. ప్రభుత్వంలోకి చొప్పించేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు.. ప్రకటన రూపంలో.. మరిన్ని కోట్లు.. ఆ పత్రికకు దోచి పెడుతున్నారు. దానికి నేటి సాక్షి పత్రికే సాక్ష్యం. సాక్షి పత్రికలో మరోసారి ప్రకటనలు హోరెత్తాయి. గ్రామ, వార్డు సచివాలాయల ప్రారంభోత్సవానికి… సాక్షి పత్రికకు.. రూ. కోట్ల విలువైన ప్రకటనలు… ఐ అండ్ పీఆర్ నుంచి వెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ పథకానికి సంబంధించి.. తెలంగాణలో, హైదరాబాద్ ఎడిషన్లలో కూడా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. సర్క్యులేషన్లో నెంబర్ వన్ అయిన ఈనాడుకు మాత్రం.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌కు మాత్రమే ప్రకటన ఇచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రికకు అసలు ఎలాంటి ప్రకటనలే ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఉద్యోగులందరికీ ఒకటో తేదీన జీతాలివ్వలేని పరిస్థితి. ఆర్టీసీకి తన వంతుగా ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ.. సాక్షి పత్రికకు మాత్రం.. రూ. కోట్లు విలువ చేసే ప్రకటనలు గుమ్మరించారు. ఏ మాత్రం అవసరం లేకపోయినా.. తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్లలోనూ ప్రకటనలు ఇచ్చారు. ఇక డిపార్టుమెంట్ల వారీగా ఇచ్చే ప్రకటనలు అదనం. వీటి విలువ రూ. కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. నిజానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ ఇక్కడ సాక్షి పత్రికకు మాత్రమే… ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం ప్రకటనల బడ్జెట్లో సాక్షి పత్రికకు 70 శాతం ఇచ్చేసి మిగతా మొత్తం.. ఇతర పత్రికలకు ఇస్తున్నారు.
నిజానికి ఎవరైనా.. ప్రభుత్వ అధినేతగా ఉండి.. తమ కుటుంబ సంస్థకు చెందిన వాటితో ప్రభుత్వ వ్యవహారాలు పెట్టుకోవడానికి అంగీకరించారు. నైతికత కాదనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తమ కుటుంబ సంస్థలకు.. ఏ మాత్రం సంకోచించకుండా.. ప్రభుత్వ .. ప్రజాధనంతో నిబంధనలకు విరుద్ధంగా కూడా లబ్ది చేకూరుస్తున్నారు. సాక్షి ఉద్యోగుల్ని.. సచివాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించడంతో పాటు.. సాక్షికి ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని రూ. కోట్లు వెచ్చించడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.