ప్రపంచములో ఏ ప్రాంతంలోనైనా సరే దేవుడిని పూజించాలన్నా ప్రార్థించాలన్నా.. పూలతో కొలుస్తారు.. కానీ ఆ పూలనే భగవంతుడి రూపంగ అమ్మవారి ప్రతిరూపంగ బతుకమ్మ గా కొలువడమనేది ఒక్క తెలంగాణ సంస్కృతికే సొంతం ఖన్సాస్ హిందు టెంపుల్ కల్చరల్ సెంటర్ హాల్ దీప కాంతుల వెలుగుల్లో ఆడపడుచులందరు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. కన్సాస్ సిటి తెలంగాన అసోసియెషన్ ఆద్వర్యములొ జరిగిన 13 వ వార్షికోత్సవ బతుకమ్మ మరియు దసర వేడుకలు అంబరాన్ని తాకాయి. గునిగిపూల సోయగాలు.. తంగేడు రెపరెపలు.. ఉప్పుపూల పులకరింతలు.. మందార మకరందాలు.. బంతి సింగారాలతో ముస్తాబై.. బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన మట్టి తొ తయారు చేసిన 5 అడుగుల అమ్మవారు విగ్రహం మధ్య కాకతీయ కాళా తోరణం కింద కొలువుదీరిన గౌరమ్మ, మధ్యాహ్నం 4:00 గంటలకు లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది.
రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు. బతుకమ్మ సంబరాలను ఆటాపాటాలతోఅంగరంగ వైభవంగా నిర్వహించారు. కలాశ్రీ భిక్షు నాయక్ మరియు రేలా రే రేలా ఫేం, వి6 వ్యాక్యాత సుపరిచిత జానపద గాయకురాలు షాలిని ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ.. అంటూ ఎన్నెనో జానపదాల హోరు.. బతుకమ్మ సంస్కృతి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలంతా కోలాటాలు, సంప్రదాయ బతుకమ్మ ఆట, పాటలతో సందడి చేశారు. భిక్షు నాయక్ మరియు షాలిని మరపు రాని గాన మాధుర్యం తో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేశారు. ఈ ఉత్సవాల్లో పిల్లలు పెద్దలు అంతా అందంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్క్రుతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. తమ సంస్కృతి మరియు సంప్రదాయాన్ని మరచిపోలేదని నిరూపించారు. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంపైనా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
భిక్షు నాయక్ మరియు షాలిని పాడటం ఆడటం మరియు పురుషులను కూడా, స్త్రీలని ప్రోత్సహించడానికి పిలిపించారు. ఈ కార్యక్రమం ముగిసే సరికి శక్తి మరియు అభిరుచితో మహిళలు బతుకమ్మ ఆట పాటలతో కొనసాగించి బాలికలు పాల్గొనడం కాకుండా, కోలాటం ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణ. పూజ అనంతరము భక్తులందరికీ పూజలో కంకణాలను బట్టి జమ్మి ఆకు(బంగారం) మరియు ఆక్షింతలు ఇతరులకు ఇచ్చి అలై బలై చేసారు . అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిధుల నుండి దీనెనను తీసుకున్నారు. సుమారు 1000 మంది జనాలు ఈ ప్రోగ్రాం కి విచ్హేసి సంబరాలలొ బాగమయి ఈ కార్యక్రమన్ని తెలంగాన లొ నె బతుకమ్మ జరుపుకుంటున్నమా అని తలపించె విధముగ ఈ కార్యక్రము ని విజయమంతం చేసారు. బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని ప్రత్యక్ష సాంప్రదాయ తెలంగాణ డప్పు సంగీత వాయిద్యం తో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. మృష్టాన్న భోజనాలతో సభ రాత్రి 9:30 కి పండుగ ముగిసింది.
దినేష్ చిన్నలచ్చయ్య, కిరణ్ కానకదండిల గార్ల అద్యక్షతన మరియు ఇతర కార్యవర్గ సబ్యులు గౌరి చెరుకుమూడి, శ్రీదేవి గొబ్బూరి, మహతి మండ, వెంకట్ పుసులూరి, విజయ్ కొండి మరియు 30 మంది వలంటీరుల సమిస్టి క్రుషితో ఈ కార్యక్రమం అద్భుథం గా జరిగింది. ఈ 13వ బతుకమ్మ ఉత్సవాన్ని కాన్సస్ చరిత్రలోనే అతిపెద్ద బతుకమ్మ పండుగగా దిగ్విజయంగా జరిగినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకరించిన అందించిన నాట్స్
సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, మరియు వెంకట్ మంత్రి, మీడియా పార్టనర్స్ kcdesi, TNews, ETV, V6 , TV5, TV9, మన టీవీ, నమస్తే తెలంగాణ, NRI రేడియో కి, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
చివరగా ప్రెసిడెంట్ ధినేష్ ఛినలచ్చయ్య గారు వందన సమర్పణతో ఈ వేడుకలు ముగిసాయి.
Thank you,
Raj Cheedella
Outreach and Media communications
www.KCTCA.org