బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పవన్ సాధినేని ఈ చిత్రానికి దర్శకుడు. హీరోగా తొలి సినిమాకాబట్టి.. కథ, కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు బెల్లంకొండ. తొలి ప్రయత్నంలో యూత్‌ని టార్గెట్ చేసే కథని ఎంచుకున్నట్టు సమాచారం. ఆ సినిమా ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైంది కూడా. ఇదో ప్రేమ కథ. ఓ అబ్బాయి జీవితంలోని కొన్ని కీలకమైన దశల్లో ఎదురైన అమ్మాయిలు, వాళ్లతో నడిపిన ప్రేమలు.. ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. ఇందులో నాలుగు దశల్లో.. నాలుగు ప్రేమకథలు నడుపుతాడో అబ్బాయి. చివరికి ఎవరిని పెళ్లి చేసుకున్నాడన్నది కీలకం. టెన్త్ క్లాస్‌లో ఓ లవ్ స్టోరీ, ఇంటర్లో ఒకటి, డిగ్రీలో ఓ ప్రేమకథ, అది పూర్తయ్యాక మరో లవ్ స్టోరీ. అలా ఈ సినిమా అంతా ప్రేమకథల సమాహారంలా ఉండబోతోందట. మలయాళంలో విజయవంతమై, తెలుగులోనూ రీమేక్ అయిన ప్రేమమ్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇది బెల్లంకొండ ప్రేమమ్ అనుకోవాలేమో..??