జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజున… అంటే.. మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల ఖర్చు రూ. ఐదు కోట్లు. ఇందులో రూ. రెండు కోట్ల పది లక్షల వరకూ సాక్షి పత్రిక ఖాతాకే వెళ్లాయి. మిగతా మొత్తం.. ఇతర 14 పత్రికలకు వెళ్లాయి. చంద్రబాబు ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని అందుకే అత్యంత నిరాడంబరంగా ప్రమాణస్వీకారం చేసుకుంటున్నానని.. జగన్ ప్రకటించారు. కానీ… ప్రకటనలకే.. రూ. ఐదు కోట్లు ఖర్చు పెట్టి.. ఆ నిరాడంబరత.. చాలా ఖరీదని వైసీపీ సర్కార్ నిరూపించింది. ఇది కేవలం ప్రకటన ఖర్చే.. గతంలో.. పగటి పూట చేసిన ప్రమాణస్వీకారానికి లైటింగ్ ఖర్చు రూ. పాతిక లక్షలు బిల్లు విడుదల చేశారు. మిగిలిన ఖర్చుల గురించి బయటకు రావాల్సి ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత పత్రిక సాక్షికి.. ప్రకటనల పండుగ ప్రారంభమయింది. ఆయన ప్రమాస్వీకారం చేయక ముందు నుంచే ఫుల్ పేజీ ప్రకటనలు.. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి రావడం మొదలయింది. రూ. ఐదు కోట్ల మొత్తం.. ఒక్క ప్రమాణస్వీకారం రోజు ఖర్చు మాత్రమే. మిగిలిన రోజుల్లో అంతకు మించి ప్రకటనలు.. ఫుల్ పేజీ యాడ్స్.. సాక్షి పత్రికకు వెళ్లాయి. ఈ నాలుగు నెలల కాలంలో… అనేక సందర్భాల్లో సాక్షికి… ఫ్రంట్ పేజీల్లో ఫుల్ పేజీ ప్రకటనలు మంజూరు చేశారు. ఈ మొత్తం కలిపి.. ఈ నాలుగు నెలల్లోనే… రూ. 50 కోట్ల పైచిలుకు .. ప్రకటనల రూపంలో సాక్షి మీడియాకు.. ప్రజాధనం వెళ్లి ఉంటుందని.. మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సర్క్యూలేషన్లో అగ్రస్థానంలోఉన్న ఈనాడు పత్రికకు… అంతా చేసి రూ. కోటి విలువైన ప్రకటనలు కూడా ఇవ్వలేదు.
సొంత పత్రికకు.. ప్రజాధనంతో ఇష్టం వచ్చినట్లుగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చుకోవడమే కాదు.. అర్హత ఉన్నప్పటికీ..కొన్ని పత్రికలకు ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అలాంటి వాటిలో.. ఆంధ్రజ్యోతి బాధితురాలిగా మిగిలింది. ఆ పత్రికకు.. సాక్షితో పాటు.. ఆంధ్రప్రదేశ్లో సర్క్యులేషన్ ఉంది. కాస్త సాక్షికే ఎక్కువ అయినపప్పటికీ.. ఆంధ్రజ్యోతి మూడో స్థానంలో ఉంది. అయితే… ఉనికి ఉందా.. లేదా అన్నట్లుగా ఉన్న వార్త పత్రికకు కూడా రూ. పదిహేను లక్షలకుపైగా విలువైన ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం.. ఆంధ్రజ్యోకికి.. రూపాయి విలువైన ప్రకటన కూడా ఇవ్వలేదు. చివరికి ఆశాజ్యోతి అనే ఊరూపేరూ లేని పత్రికకూ.. తమ వంతుగా.. కొంత ప్రజాధనాన్ని కట్టబెట్టారు.