సినిమా నిర్మాతలు బండ్ల గణేష్, పీవీపీ అలియాస్ పొట్లూరి వరప్రసాద్ల మధ్య బాకీ వివాదం కేసుల వరకూ చేరడంతో అసలు తెర వెనుక ఏం జరిగిందనేదానిపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అసలు వివాదం వెనుక.. ఓ టీవీ చానల్ ఓవర్ చేసిన సెటిల్మెంట్ ఉందని తెలుస్తోంది. టెంపర్ సినిమా సమయంలో పీవీపీ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఫైనాన్సింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో బండ్ల గణేష్‌కు రూ. ఏడు కోట్లు ఇచ్చారు. మామూలుగా అయితే.. ఫైనాన్షియర్లకు క్లియర్ చేసిన తర్వాతే రిలీజ్‌కు అవకాశం ఉంటుంది. అయితే బండ్ల గణేష్ … మాత్రం… ఓ టీవీ చానల్ ఓనర్ వద్దకు వెళ్లి… తను చెప్పాల్సిన మాటలు చెప్పి… పీవీపీకి ఇవ్వాల్సిన సొమ్ము వడ్డీతో పాటు… వాయిదాల పద్దతిలో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వాయిదాలు కూడా.. కొన్నాళ్లు కట్టి తర్వాత లైట్ తీసుకున్నారంటున్నారు.
అలా కట్టకుండా వదిలేసిన మొత్తం.. వడ్డీలు కలిపి ఇంకా రూ. ఐదు కోట్లు వరకూ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటి చెల్లింపులపై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన బండ్ల గణేష్… ఓ హోటల్లో.. పీవీపీ ఎదురుపడినప్పుడు.. తన మార్క్ స్కిట్ ప్రదర్శించారంటున్నారు. ఓ సెవన్ స్టార్ హోటల్లో పీవీపీ కనిపించినప్పుడు.. ఎదురుగా వెళ్లి.. డబ్బులకు కాస్త ఇబ్బందిగా ఉంది.. మీకివ్వాల్సిన రూ. కోటిన్నర ఇచ్చేస్తానని చెప్పారట. ఆ మాట విని పీవీపీకి ఫ్యూజులు ఎగిరిపోయాయంటున్నారు. రూ. ఐదు కోట్లు కావాలంటే… రూ. కోటిన్నర అంటున్నాడేమిటని షాకయ్యారు. అక్కడే మాట మాట పెరిగింది. ఆ తర్వాత బండ్ల తన మనుషుల్ని పీవీపీ ఇంటికి పంపారు. అయితే.. మాట్లాడటానికి పీవీపీ నిరాకరించారు. ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసిన టీవీ చానల్ ఓనర్ దగ్గరే తేల్చుకోవాలని పీవీపీ తేల్చేసినట్లుగా చెబుతున్నారు. ఇదే వివాదం చినికి చినికి కేసుల వరకూ వెళ్లిందంటున్నారు.
తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో.. బండ్ల గణేష్‌ను పార్టీలో చేర్చింది… టిక్కెట్ ఇప్పించేందుకు కూడా.. ఈ టీవీ చానల్ ఓనరే.. బండ్ల గణేష్‌కు గాడ్ ఫాదర్‌గా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ టీవీ చానల్ ఓనర్ కూడా.. బండ్ల దెబ్బకు ఠారెత్తిపోతున్నారని అంటున్నారు. పీవీపీ తనకు బండ్లతో సెటిల్మెంట్ చేసిన.. టీవీ చానల్ ఓనరే డబ్బులు కట్టాలని ఒత్తిడి చేసే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు బండ్ల.. ఈ వివాదం అడ్డం పెట్టుకుని.. పీవీపీపై ట్విట్టర్ లో విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. స్కాం రాజా అంటూ.. ట్వీట్లు చేస్తున్నారు. ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోయే అవకాశమే కనిపిస్తోంది.