తెలుగు టాప్ స్పోర్ట్స్ స్టార్స్ కుటుంబాలు బంధుత్వాలు కలపుకోబోతున్నాయి. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ కుమారుడు అసద్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా డిసెంబర్లో నిఖా చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని సానియా మీర్జా ధృవీకరించింది. కొద్ది రోజులుగా… అసద్, ఆనం … జంటగా చక్కర్లు కొడుతున్నారు. వారు తమ బంధాన్ని దాచుకోలేదు. ఇద్దరి మధ్య గాఢమైన కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందని పలుమార్లు… ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెట్టి మరీ అందరికీ చాటింపేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఆనం మీర్జాకు.. మూడేళ్ల కిందట.. అక్బర్ రషీద్ అనే వ్యాపారవేత్తతో వివాహం అయింది. అయితే.. ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడలేదు. అక్బర్ రషీద్‌తో విబేధాలు రావడంతో.. తలాఖ్ తీసుకున్నారు. అజహరుద్దీన్ కుమారుడితో అభిప్రాయాలు కలవడంతో… ఇద్దరూ కలిసి.. జంటగా తిరగడం ప్రారంభించారు. ఆనం మీర్జా.. మొదట్లో షూటింగ్ పై ఆసక్తి చూపారు. అయితే.. అక్క సానియాలా… మెడల్స్ సాధించే స్థాయికి వెళ్లలేదు. ప్రస్తుతం ఫ్యాషన్ బిజినెస్ చేస్తున్నారు. అజహరుద్దీన్ కుమారుడు.. అసద్.. న్యాయవాద విద్య చదివారు. తండ్రి వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నట్లుగా చెబుతున్నారు. అజహర్ మరో కుమారుడు.. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెట్ షోయుబ్ మాలిక్ ను వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల కిందటే.. ఓ మగబిడ్డకు.. సానియా మీర్జా జన్మనిచ్చారు. అంతకు ముందు.. సానియా వివాహం విషయంలోనూ… కొన్ని వివాదాలు వచ్చాయి. మొదట్లో నిశ్చితార్థం చేసుకున్న వరుడ్ని సానియా పెళ్లి చేసుకోలేదు. ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని .. షోయుబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నారు. షోయుబ్ మాలిక్ అంతకు ముందే ఓ హైదరాబాదీ యువతితోనే నిఖా అయిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే.. తర్వాత అన్ని వ్యవహారాలను సెటిల్ చేసుకుని.. పెళ్లి చేసుకుని హ్యాపి కపుల్స్ గా మారారు. ఇప్పుడు సోదరి వివాహ జీవితాన్ని సానియా తీర్చిదిద్దుతున్నారు.