భారతీయ జనతా పార్టీ నేత , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు.. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడిలో అవమానం జరిగింది. మాజీ కేంద్ర మంత్రి అయినప్పటికీ.. ఆయనకు.. కనీస గౌరవం ఇవ్వడానికి .. ప్రోటోకాల్ ఇవ్వడానికి అధికారులెవరూ సిద్ధపడలేదు. కానీసం కానిస్టేబుల్స్ కూడా ఆయనను పట్టించుకోలేదు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనేందుకు ముందుగా సమాచారం ఇచ్చి మరీ కుటుంబంతో సహా.. కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి వచ్చారు. అయితే.. ఒక్కరంటే… ఒక్క అధికారి కూడా.. పట్టించుకోలేదు. దాంతో.. ఆరో ఆయనే కుటుంబంతో సహా ఆరో అంతస్తుకు వెళ్లారు. సామాన్యభక్తులతోపాటు వెళ్లడంతో.. ఆయన తోపులాటలో.. పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారు. పైకి ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పినప్పటికీ.. ఆయన వర్గాలు ఆయనకు ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు.
కుంకుమార్చన జరిగే ప్రదేశానికి వెళ్లడానికి కృష్ణంరాజు చాలా అవస్థలు పడ్డారు. పలుమార్లు ఆయాసంతో కూర్చుండిపోయారు. చివరికి అతి కష్టం మీద.. ఈవో కార్యాలయం పక్కన ఉన్న కుంకుమార్చన వద్దకు చేరుకున్నారు. కృష్ణంరాజును ఆలయ అధికారులు అంతగా ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. సాధారణ వైసీపీ నేత వస్తే.. సకల మర్యాదలు చేస్తున్న .. ఆలయ అధికారులు ఇతరులు వస్తే మాత్రం కనీస గౌరవం ఇవ్వడం లేదు. సామాన్య భక్తుల కోసం కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. కేవలం.. వైసీపీ నేతలు, వారి అనుచరుల కోసమే… దసరా ఉత్సవాలు జరుపుతున్నట్లుగా అధికారులు వ్యవహరించండం భక్తుల ఆగ్రహానికి కారణం అవుతోంది. కృష్ణంరాజు.. తాను ఆలయానికి వస్తున్నట్లుగా ముందస్తుగా సమాచారం పంపినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెట్టినట్లుగా చర్చ జరుగుతోంది.
బీజేపీ నేతలపై.. పాలక వర్గాలకు ఉన్న కోపంతో… తాము కృష్ణంరాజుకు ఎక్కడ అధికార మర్యాదలు చేస్తే.. పై అధికారులకు కోపం వస్తుందోనన్న ఉద్దేశంతో… దుర్గ గుడి అధికారులు కావాలనే పట్టించుకోలేదని చెబుతున్నారు. కృష్ణంరాజు బీజేపీ నేతగా కాకపోయినా.. ఆయన వృద్ధాప్యం, ఆనారోగ్యం కారణంగా అయినా.. ఆయనకు.. ఇబ్బందిలేకుండా.. అమ్మవారి దర్శనం చేయించాల్సి ఉంది. అదీ కూడా చేయకుండా.. కృష్ణంరాజును తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.