అతన్ని అందరూ మంచివాడు మంచివాడు అంటారు.
ఊరంతా ఉత్తముడిగా నెత్తిమీద పెట్టుకున్నారు.
మంచితనం తన ఇంటి పేరైపోయింది. కానీ.. అది పేరుకి మాత్రమే. ఎవరైనా తేడాగా కనిపిస్తే… వాళ్ల తాట తీసేస్తాడు. ‘ఊరంతా మంచోడంటుంటే.. నువ్వేంట్రాబాబూ ఇలా కొట్టేస్తున్నావ్’ అంటే.. ‘రాముడ్ని కూడా మంచోడే అన్నారు. కానీ… రావణాసురుడి చంపాడు కదా’ అని ఓ పెద్ద లాజిక్ తీస్తాడు. మంచితనంతో పాటు మొండితనం కూడా ఈ హీరో కథేమిటో తెలియాలంటే – ఎంత మంచి వాడవురా చూడాలి. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శతమానం భవతితో సూపర్ హిట్ ఇచ్చిన సతీష్ వేగేశ్న దర్శకుడు. సతీష్ బలం.. ఎమోషన్స్. ఈసారి దానికి యాక్షన్ కూడా తోడైనట్టు అనిపిస్తోంది. పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. కాస్టింగ్ కూడా.. బలంగానే ఉంది. సంక్రాంతికి వస్తున్నట్టు టీజర్లోనే చెప్పేశారు. శతమానం భవతి కూడా సంక్రాంతికి విడుదలై – కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈసారీ వీళ్ల టార్గెట్ ఇదే. ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న ఈ కథ.. సంక్రాంతికి తగినదే.