చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున.. ఒక దశ తెలుగు సినిమా పరిశ్రమకు నాలుగు ఫిల్లర్స్ లాంటి హీరోలు. అయితే ఇందులో చిరంజీవి- బాలకృష్ణ ల మధ్య కొంచెం డిఫరెంట్ ఈక్వేషన్ వుంది. ఇద్దరూ మాస్ ఫాలోయింగ్ తో అశేష అభిమానులు, అభిమాన సంఘాలు ఏర్పరుచుకున్న హీరోలు. ఎన్టీఆర్ వారసత్వం , ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా బాలయ్యకు యాడ్ అయ్యింది. ఆ ఫాలోయింగ్ ని నిలబెట్టుకునే సినిమాలు చేశారు బాలయ్య. ఇక చిరంజీవి తనకంటూ ఓ అభిమాన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న హీరోగా నిలబడ్డారు. అయితే బయటికి ఎంత చెప్పుకున్నా.. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య.. ఒక పోటీ కనిపిస్తుంది. అలాగే ఆ ఇద్దరి మధ్య కూడా చిన్న గ్యాప్ వుంది. ఇప్పుడు అది మరోసారి బయటపడింది.
‘సైరా’ సక్సెస్ పై దర్శకుడు త్రివిక్రమ్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి. ఇందులో ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. ‘సైరాని నాగార్జున , వెంకటేష్ చూశారు. సినిమాని నాతో పాటు నాగార్జున చూశారు. సినిమా అయిన తర్వాత బయటకొచ్చి నన్ను గట్టిగా పట్టేశారు. ఆయనకు మాట రావడంలేదు. ఇదొక ఎపిక్ అన్నారు. ఆ తర్వాత వెంకటేష్ ఇంటికి వచ్చి.. నన్ను గట్టిగా కౌగలించుకున్నారు. ఎంతకీ వదల్లేదు. ఇక రజనీకాంత్ కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. వాళ్ళ ఆవిడ లతగారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు” అని చెప్పారు మెగాస్టార్.
వీళ్ళే కాదు సైరాపై దాదాపు తెలుగు ఇండస్ట్రీ స్పందించింది. కానీ నాలుగు పిల్లర్స్ లో బాలయ్య అనే పిల్లర్ మాత్రం ఇప్పటివరకూ చిన్న రియాక్ష్ కూడా ఇవ్వలేదు. ఇక వాళ్ళ ఈక్వేషన్ గురించి తెలిసివాళ్ళు.. బాలయ్య స్పందించే అవకాశమూ లేదని తేల్చి చెబుతున్నారు. అలాగే జరిగితే బాలయ్య- చిరుల గ్యాప్ కంటిన్యూ అని ఫిక్స్ అయిపోవచ్చు.