వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరారవుకు పొగపెట్టడం ఊపందుకుంది. పర్చూరు నియోజకవర్గంలో రావి రామనాథంబాబు అనే నేతను వైసీపీలో చేర్చుకుని అన్ని పనులు ఆయనకే చేసి పెట్టమని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడ్ని పట్టించుకునేవారు కరవయ్యారు. తమను ఎందుకు పక్కన పెట్టాలనుకుంటున్నారో… తెలుసుకునేందుకు.. దగ్గుబాటి కొద్ది రోజులుగా జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు సమయం దొరకడం లేదు. కనీసం.. పార్టీ వ్యవహారాలను చూస్తున్న విజయసాయిరెడ్డిని కలుసుకుని అయినా… ఏం జరుగుతుదో తెలుసుకుందామంటే.. దానికీ.. అవకాశం ఇవ్వడం లేదు. దాంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు సీన్ అర్థమయిపోయిదనే ప్రచారం జరుగుతోంది. అయితే.. జగన్ తో భేటీ కావాలంటే.. ముందుగా ఓ అంశంపై క్లారిటీ ఇవ్వాలంటూ… దగ్గుబాటికి… సమాచారం పంపారు.
అదేమిటంటే… పురంధేశ్వరి వైసీపీలో వస్తారా..? మీరు బీజేపీలోకి వెళ్తారా..? అనేదానిపై క్లారిటీ అడిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరూ చెరో పార్టీలో ఉండటం వల్ల.. సమస్యలు వస్తున్నాయని… పురందేశ్వరి వైసీపీలోకి వస్తే.. ప్రాధాన్యం ఇస్తామని … లేకపోతే… పార్టీకి అవసరం లేదన్నట్లుగా.. సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. దీనిపై.. దగ్గుబాటి కుటుంబంలో చర్చ జరుగుతోంది. నిజానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరాలనుకోలేదు. ఆయన కుమారుడు హితేష్ చెంచురామ్ ను పార్టీలో చేర్చారు. కానీ ఆయనకు అమెరికా పౌరసత్వం ఉంది. నామినేషన్ల సమయానికి ఆ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకోలేకపోయారు. ఫలితంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావే పోటీ చేయాల్సి వచ్చింది. కానీ పరాజయం పాలయ్యారు.
అప్పట్లో పురందేశ్వరి బీజేపీలోనే ఉన్నారు. అప్పట్లో లేని అభ్యంతరం ఇప్పుడెందుకనే చర్చ… దగ్గుబాటి కుటుంబంలో జరుగుతోందని తెలుస్తోంది. పొమ్మనలేక పొగ పెడుతున్నారని… తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. కుమారుడి రాజకీయ భవిష్యత్ పైనే ఆయనఆలోచన చేస్తున్నారంటున్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటే హితేష్ చెంచురామ్‌కు… వైసీపీలో ప్రాధాన్యం దక్కే అవకాశం లేదంటున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు.