మెగా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నలభై ఎనిమిది గంటల నుంచి సుదీర్ఘంగా.. దాదాపుగా ఎనభై మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. సోదాలు జరుగుతున్న చోట… తెలంగాణ పోలీసులను భద్రత కోసం వినియోగించడం లేదు. పూర్తి స్థాయిలో.. కేంద్ర బలగాలను.. మోహరించారు. దీంతో…అసలేం జరుగుతోందన్నదానిపై అందరిలోనూ అత్కంఠ పెరిగిపోతోంది. ముందుగా… మేఘా కంపెనీ పీఆర్వోల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. అవి రొటీన్ సోదాలు మాత్రం కాదని మాత్రం… అందరూ ఓ అంచనాకు వచ్చారు. సాధారణ సోదాలు అయితే… మహా అయితే.. మూడు, నాలుగు గంటలు మాత్రమే ఉంటాయి. వారికి ఉన్న అనుమానాల నివృత్తి చేసుకుని .. .కావాల్సిన సమాచారం తీసుకుని వెళ్లిపోతారు. కానీ… మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో మాత్రం… గంటల తరబడి సాగుతున్నాయి.
మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో లభించిన సమాచారానికి.. ఐటీ అధికారులు అడుగుతున్న వివరణలకు… ఆధారాలు చూపించడానికి తంటాలు పడే పరిస్థితి ఉంటేనే… ఇలా ఆలస్యమవుతుందని ఐటీ విషయాల్లో నైపుణ్యం ఉన్నవారు చెబుతున్నారు. మామూలుగా ఇలాంటి హైప్రోఫైల్ ఐటీ దాడులు జరిగితే.. మీడియా హడావుడి ఎక్కువగా ఉంటుంది. తమకు ఉన్న సోర్సుల ద్వారా… ఏదో ఓ విషయాన్ని బ్రేక్ చేసి… ప్రజలకు అందిస్తూ ఉంటాయి. వీటిలో ఉహాగానాలే ఎక్కువగా ఉంటాయి. గతంలో రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగినప్పుడు.. ఆయనకు విదేశాల్లో బ్యాంకు ఖాతాలని… రూ. వెయ్యి కోట్ల ఆస్తులని.. టీవీ9, ఎన్టీవీ లాంటి మీడియా సంస్థలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను కూడా ప్రసారం చేశాయి. అయితే.. మేఘా కృష్ణారెడ్డి విషయంలో మాత్రం.. అసలు సోదాలు జరుగుతున్న విషయాన్ని కూడా చెప్పడం లేదు.
ఈ కారణంగానే మేఘా కృష్ణారెడ్డిపై సోదాలు జరుగుతున్నాయా.. లేదా అన్నదానిపై ప్రజలకు కూడా.. సరైన సమాచారం అందడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం అత్యంత భారీ స్థాయిలో సోదాలు చేస్తున్నదంటేనే.. రొటీన్ వ్యవహారం కాదన్న అభిప్రాయం… అంతటా వ్యక్తమయింది. ఇప్పుడా విషయం మెల్లగా బయట పడుతోంది. మామూలుగా… రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సహకారం ఉండదని భావించినప్పుడే.. కేంద్ర బలగాల సాయాన్ని ఐటీ వర్గాలు తీసుకుంటాయి. ఇప్పుడు… మేఘా కృష్ణారెడ్డి విషయంలో.. కేంద్ర బలగాల సాయమే తీసుకుంటున్నాయి. ఇంకా విశేషం ఏమిటంటే… స్థానిక ఐటీ అధికారులకు కూడా… సమాచారం లేదు. పూర్తిగా.. ఢిల్లీ స్థాయిలో… మేఘా కంపెనీపై ఐటీ ఆపరేషన్ జరుగుతోందంటున్నారు.