తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితులైన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏం దొరికాయన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. సుదీర్ఘంగా సోదాలు కొనసాగుతున్నాయి. విడతల వారీగా అధికారులు సోదాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సోదాల్లో.. భారీగా అవకతవకలు బయటపడి.. అప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన సమాచారం ఉంటే… సోదాలు ఆలస్యమవుతాయని.. ఆదాయపు పన్నుశాఖ నిపుణులు చెబుతున్నాయి. మొత్తం ఢిల్లీకి చెందిన ఐటీ అధికారులే.. సోదాలు చేస్తున్నారు. దాంతో లోకల్ మీడియాకు కనీస సమాచారం అందడం లేదు. కొంత మందికి అందినా.. వాటిని ప్రసారం చేసేందుకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. మీడియాకు కూడా మేఘా కృష్ణారెడ్డి ఎంతో ఇష్టమైన వ్యక్తి కావడంతో.. ఐటీ అధికారులు ఏదైనా అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాత మాత్రమే .. వాటిని ప్రకటించే.. ప్రచురించే అవకాశం ఉంది. అయితే.. ఢిల్లీ మీడియాకు మాత్రం.. సమాచారం అందుతోంది.
దేశంలోని అగ్రశ్రేణి న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటి అయిన నెట్‌వర్క్ 18 సంస్థ కు చెందిన న్యూస్ 18 న్యూస్ చానల్ … ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి రూ. వంద కోట్ల రూపాయల చందాను మెగా ఇంజినీరింగ్ కాంపెనీ ఇచ్చినట్లుగా ఆధారాలు దొరికాయని ప్రకటించింది. రాజకీయ పార్టీలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో మేఘా కృష్ణారెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా… అందరికీ ఆయన ఆర్థిక సాయం చేస్తారని రాజకీయపార్టీలు చెబుతూంటాయి. ఏ పార్టీ.. ఎక్కడ అధికారంలో ఉన్నా.. ఆయన తన పనులను మాత్రం స్మూత్‌గా కొనసాగించేస్తంటారు. ఈ క్రమంలో… జాతీయ స్థాయిలో ఓ ప్రముఖ పార్టీకి రూ. వంద కోట్లు ఎన్నికల ఖర్చు కింద పంపారు. అయితే.. ఇలా పంపిన విధానమే ఆశ్చర్యకరంగా ఉందని.. న్యూస్ 18 చెబుతోంది.
ఇప్పటికైతే మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఏం దొరికాయి..? ఇంత సుదీర్ఘంగా ఎందుకు సోదాలు చేస్తున్నారు.. ? వేల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థ లోగుట్టు దొరికిపోయిందా..? ఎవరెవరి జాతకాలు బయటకు వస్తాయి..? అనే అంశాలపై… చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మీడియా చాలా లోప్రోఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తూండటంతో… ఈ అంశంపై సోషల్ మీడియాలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది. సోదాలు ముగిసిన తర్వాత ఐటీ అధికారులు చేసే ప్రకటనను బట్టే.. మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
#BREAKING – Hyderabad based firm gave more than ₹100 crore cash to AICC: I-T department.
The cash was siphoned off through government expenditure. Searches at Megha engineering led to AICC office-bearers.@Ashish_Mehrishi with more details pic.twitter.com/g9TXdKJLFc
— News18 (@CNNnews18) October 13, 2019