మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రణాళికల వివరాలు దొరికాయా…?. అవుననే అంటోంది ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక . మేఘా కృష్ణారెడ్డి ఇటీవలి కాలంలో కొనుగోలు చేసిన గోల్డ్ స్టోన్ అనే కంపెనీకి సంబంధించి… శాఖోపశాఖలుగా..ఈ స్కాం విస్తరించి ఉందని.. దీనికి సంబంధించి…ఇప్పటికే… కొంత భాగం ఆర్టీసీ మేఘా చేతుల్లోకి వెళ్లిపోయిందని కూడా… ఇంగ్లిష్ డైలీ విశ్లేషిస్తోంది. మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో గోల్డ్ స్టోన్ – ఒలెక్ట్రా అనే ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థ పత్రాలు లభ్యమయ్యాయి. ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ ఇప్పటికే 40 బస్సులను అద్దె ప్రాతిపదికన.. టీఎస్ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసింది. ఒక్కో బస్సు రూ. రెండు కోట్లు. ఇందులో రూ. కోటి .. టీఎస్ఆర్టీసీకి కేంద్ర సబ్సిడీ రూపంలో ఇచ్చింది. కానీ.. ఈ డబ్బులు ఆర్టీసీకి చేరలేదు. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీకి చేరాయి. బస్సులు అద్దెకు ఇచ్చి.. డబ్బులు వసూలు చేస్తున్నా.. కేంద్రం ఇచ్చిన సబ్సిడీ ప్రైవేటు కంపెనీకి చేరిన దానికి అన్ని ఆధారాలు ఐటీ అధికారులకు లభించాయి. ఈ ఒలెక్ట్రా గ్రీన్ టెక్… మేఘా కృష్ణారెడ్డి కుటుంబానికి చెందినది.
కొద్ది రోజుల క్రితం.. ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ అనే కంపెనీ మేఘా కృష్ణా రెడ్డి రూ. 650 కోట్లు పెట్టి సగం వాటా కొన్నారు. ఈ ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ యజమాని గోల్డ్ స్టోన్ ప్రసాద్. మియాపూర్ భూకుంభకోణంలో ఈయన పేరు మార్మోగిపోయింది. ఈ ప్రసాద్ గోల్డ్ స్టోన్ పవర్ అనే కంపెనీని పెట్టారు. ఈ కంపెనీ… చైనాకు చెందిన ఓలెక్ట్రా అనే ఎలక్ట్రిక్ బస్ తయారీ కంపెనీని కొనుగోలు చేసింది. ట్రినిటీనిలో రూ. 650 కోట్లు పెట్టి వాటా కొనడం ద్వారా… ఈ మొత్తం కంపెనీల్లో మెజార్టీ వాటా మేఘా కృష్ణారెడ్డి చేతికి వచ్చింది. ఇప్పుడు.. టీఎస్ఆర్టీసీకి 334 బస్సుల కాంట్రాక్టులను కూడా ఆయన పొందబోతున్నారు. ఇందులోనూ కేంద్రం ఇచ్చే సబ్సిడీ మొత్తం ఆ కంపెనీ ఖాతాలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ డాక్యుమెంట్లన్నీ ఐటీ అధికారులకు దొరికాయని.. ఇంగ్లిష్ పత్రిక ప్రకటించింది. ప్రస్తుతం ఓలెక్ట్రాలో యాభై శాతం మేఘా కృష్ణారెడ్డికి, 38 శాతం గోల్డ్ స్టోన్ ప్రసాద్‌కు.. మిగతాది పబ్లిక్ చేతుల్లో ఉంది. మేఘా కృష్ణారెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు. ఈ ఐటీ దాడుల వ్యవహారం… చిలువలు… పలువులుగా మారి… టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వైపు వెళ్తుందనేది.. ఇంగ్లిష్ పత్రిక కథనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు..!