రవిప్రకాష్ – సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్..! ఇప్పుడిది టీవీ9, 10 టీవీ చానళ్లకు… టాప్ మోస్ట్ ప్రయారిటీ హాస్పిటల్. రవిప్రకాష్ సీఈవోగా ఉన్న సమయంలో.. సిలికానాంధ్ర సంజీవని హాస్పిటల్‌కు… ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించే లక్ష్యంతో.. సిలికానాంధ్ర సంస్థతో కలిసి.. రవిప్రకాష్ చేసిన ప్రయత్నం ఇది. రవిప్రకాష్ స్వయంగా రూ. రెండుకోట్ల రూపాయలను.. డొనేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినందుకు.. మీడియా ద్వారా ప్రచారం చేసి.. మరిన్ని విరాళాలు ఇచ్చినందుకు గుర్తుగా హాస్పిటల్‌లో పేరులో రవిప్రకాష్ అనే పేరు కూడా చేర్చారు. ఇప్పుడు.. ఈ పేరును టార్గెట్ ను చేసుకుని.. టీవీ9, 10 టీవీ చానళ్లు వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
రవిప్రకాష్ బోనస్‌గా తీసుకున్నారని చెబుతూ వస్తున్న రూ. పద్దెనిమిదికోట్ల నుంచే.. సిలికానాంధ్ర సంజీవనికి రూ. 2 కోట్లు ఇచ్చారని.. కొత్త యాజమాన్యం నిర్ణయానికి వచ్చింది. అందుకే.. వారు… కోర్టులో.. బోనస్ డబ్బులు ఎక్కడికి తరలించారో తెలియాల్సి ఉందని.. కస్టడీకి ఇవ్వాలని కోర్టును పదే పదే కోరారని చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకోవడానికి కస్టడీకి తీసుకోవాల్సిన పని లేదు. బ్యాంకర్లు ఆ సమాచారం ఇస్తారు. అయితే.. అసలు ఉద్దేశం.. అక్రమంగా బోనస్ తీసుకున్న సొమ్మును… ఆ ఆస్పత్రికి ఇచ్చారని.. ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని సిలికానాంధ్ర సంజీవని ట్రస్ట్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా కాకపోతే రవిప్రకాష్ పేరును ఆస్పత్రికి తీసేయాలన్న డిమాండ్ కూడా.. టీవీ9 కొత్త యాజమాన్యం పెట్టే అవకాశం ఉందని రవిప్రకాష్ వర్గీయులు అనుమానిస్తున్నారు.
నిజానికి సిలికానాంధ్ర – సంజీవని ఆస్పత్రి వ్యవహారాలు, విరాళాలు, ఖర్చులు వంటి విషయాలను రవిప్రకాష్ ఎప్పుడూ ప్రత్యక్షంగా పరిశీలించలేదు. ఆయన ఉడతాభక్తిగా ధన, ప్రచార సాయం చేశారు. కానీ.. రవిప్రకాష్ విరాళాలు సేకరించారని.. రూ. 50 కోట్లు గల్లంతు చేశారని… టీవీ9, టెన్ టీవీ ఆరోపణలు ప్రారంభించాయి. నిజంగా ఇలాంటి ఆరోపణలు ఎవరు చేయాలి.. ఆయా ఆస్పత్రి వ్యవహారాలు చూసేవారు ఎవరైనా చేయాలి. ఎందుకంటే.. వారికి అవకతవకలు జరిగితే తెలుస్తుంది. కానీ.. అసలు సంబంధమే లేని టీవీ9 , 10 టీవీ యాజమాన్యాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తంగా.. ఆస్పత్రి నిర్వహణను రిస్క్‌లో నెట్టేలా… కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.