ఇప్పుడు రాజధాని ఎక్కుడుంది..? అనే అనుమానం అక్కర్లేదు. రాజధాని మంగళగిరిలో లేదు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న వెలగపూడి గ్రామంలో ఉంది. అందుకే… మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి … రాజధానిని మంగళగిరికి మార్చాలంటున్నారు. మంగళగిరిలో పదివేల ఎకరాల అటవీ, ప్రభుత్వ భూములన్నాయని.. కావాల్సినన్ని.. భవనాలు అందుబాటులో ఉన్నాయని… కార్యాలయాలన్నింటినీ రాజధానికి మారిస్తే.. ఇబ్బందులు ఏమీ ఉండవని ఆర్కే.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వానికి… కార్యాలయాలను.. మంగళగిరికి మార్చే ఆలోచన ఉందని.. కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై.. ప్రభుత్వ పెద్దలు స్పందించకపోయినా… దానికి తగ్గట్లుగా.. ఒక్కొక్కరితో లేఖలు.. డిమాండ్లు మాత్రం వినిపిస్తున్నారు. అంటే.. ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్లుగానే భావించాలి.
రామకృష్ణారెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా… లేఖలు రాయడం.. వాటిని మీడియాకు విడుదల చేయడం అనేది అసాధ్యం. సాధారణంగా ఎవరైనా వైసీపీ ఎమ్మెల్యే ప్రెస్మీట్ పెట్టినా… లేఖ రాసినా.. సొంతంగా… చేసే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో.. సాక్షి ఆఫీసు నుంచే ఈ తతంగం నడుస్తుంది. ఏం మాట్లాడాలన్నది ముందుగానే నోట్ రూపంలో ఇస్తారు. ఇక లేఖలయితే.. సాక్షి ఆఫీసులోనో.. వైసీపీ ఆఫీసులోనే రెడీ అవుతాయి. ఆర్కే లేఖ కూడా.. అలా సిద్ధమయిందని… ఆ తర్వాతే మీడియాకు విడుదల చేశారని భావిస్తున్నారు.
రైతు భరోసాను మూడు ముక్కలు చేయడానికి … రైతులే కారణమని.. వారే కోరుకున్నారని ప్రభుత్వం ప్రకటించుకుంది. అదే తరహాలో.. వెలగపూడి నుంచి.. మంగళగిరికి ప్రభుత్వ కార్యాలయాలన్నీ మార్చాలన్న డిమాండ్లను.. తెరమీదకు తీసుకు వచ్చి.. ప్రజలే కోరుతున్నారంటూ.. మార్చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. త్వరలో కొంత మంది సీనియర్ అధికారులు, కొత్తగా నియమితులయిన సలహాదారులు కూడా.. ఈ మేరకు జగన్ కు ఓ వినతి పత్రం సమర్పిస్తారని.. ఆ తర్వాత కార్యాచరణ ప్రారంభమవుతుందని అంటున్నారు. మొత్తానికి మంగళగిరి నుంచి వెలగపూడికి ఓ పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి.