ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటించబోతున్నారు. చివరికి వరకూ సీఎం ఢిల్లీ పర్యటనపై మీడియా వర్గాలకు సమాచరం ఇవ్వలేదు. ఆయన ఢిల్లీకి ఏ పని మీద వెళ్తున్నారో..? ఎవరెవర్ని కలవబోతున్నారో కూడా సమాచారం లేదు. అయితే.. సోమవారం ఉదయమే ఆయన హస్తినకు బయలుదేరడం మాత్రం ఖాయం. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రుల్ని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎవరెవర్ని కలవాలో.. ఏమి అడగాలో ఎజెండా నిర్దేశించుకోకుండా.. జగన్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లడం ఎందుకనే.. సందేహం అందరికీ వస్తోంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు.
అమిత్ షా.. పది రోజుల కిందట.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అప్పుడే హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాల్సి ఉంది. కానీ రెండు గంటలు ఆలస్యంగా వెళ్లడంతో.. అపాయింట్మెంట్ రద్దు అయింది. మోడీని కలిశారు కానీ.. అమిత్ షాను కలవలేకపోయారు. అప్పటికి తిరిగి వచ్చేసినా.. తర్వాత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు. గత వారం ఓ సారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు కానీ.. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల హడావుడి ముగిసే వరకూ.. ఎలాంటి అపాయింట్మెంట్లు లేవని అమిత్ షా తేల్చేశారు. దాంతో.. అప్పటికి వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు.. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. అమిత్ షా ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే జగన్ ఢిల్లీ టూర్ కి రెడీ అయ్యారు.
రెండు రోజుల పాటు.. ఢిల్లీలో ఉండి ఎట్టి పరిస్థితుల్లోనూ అమిత్ షాలను కలవాలనే పట్టుదలతో.. జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. నవంబర్ ఒకటో తేదీన సీబీఐ కోర్టులో… సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై.. తీర్పు రానుంది. ఈ క్రమంలో.. హోంమంత్రితో భేటీ కోసం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. వేల కోట్లలోనే పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి.. వైసీపీ ఎంపీలు కానీ.. ఇతర నేతలు కానీ.. ఎప్పుడూ.. కేంద్రమంత్రుల్ని కలవలేదు. కానీ హోంమంత్రితో భేటీకి మాత్రం జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.