ప్రగతిభవన్ ముట్టడికి ప్రణాళిక రూపొందించిన రేవంత్ రెడ్డి… పోలీసులకు చుక్కలు చూపించారు. రేవంత్ రెడ్డి చాలా పెద్ద ప్రణాలికలే వేసుకుంటున్నారని.. సమాచారం తెలుసుకున్న పోలీసులు… కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. కానీ.. రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో మాత్రం కనిపెట్టలేకపోయారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు.. పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారు కదా..అని .. బయలుదేరేందుకు కూడా ఏర్పాట్లు చేసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం… ప్రగతిభవన్‌ను ముట్టడించి తీరాలని.. నిర్ణయించుకున్నారు. తన అనుచరులకు దిశానిర్దేశం చేసి.. ఆయన నిన్న సాయంత్రమే ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాత్రి ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్ తగిలింది. అక్కడ రేవంత్ రెడ్డి లేకపోవడంతో.. ఎక్కడున్నారో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో.. ప్రగతి భవన్ వద్ద.. భద్రతను పెంచారు. బేగంపేట మెట్రో స్టేషన్ ను కూడా మూసివేశారు. సాయంత్రంలోపు.. ఎలాగైనా సరే.. ప్రగతిభవన్‌ను ముట్టడించి తీరుతానని.. రేవంత్ రెడ్డి.. మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులకు మరింత టెన్షన్ ప్రాంభమయింది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో.. రేవంత్ రెడ్డి హఠాత్తుగా.. బేగంపేటలో ప్రత్యక్షమయ్యారు. సమీపంలోని ఓ భవనం నుంచి నల్లచొక్కాతో ద్విచక్రవాహహనం నుంచి బయటకు వచ్చిన ఆయన… ప్రగతిభవన్ వైపు దూసుకెళ్లారు. రేవంత్ అలా వస్తారని ఊహించలేకపోయిన పోలీసులు… తేరుకుని.. ఆయనను.. ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఫ్లైఓవర్ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు.
నిర్బంధాలను ఎదుర్కొని అయినా.. ప్రగతిభవన్ ను ముట్టడించామని.. రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలు స్వేచ్చను కోరుకుంటున్నారన్నారు. త్వరలో ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొడతామని ప్రకటించారు. ఉదయం నుంచి ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులే ఏర్పడ్డాయి. ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ నిర్బంధాలతోనే… తమ నిరసన సక్సెస్ అయిందని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.