ఒకప్పుడు తెలుగు హీరోలతో పోటీ పడుతూ సూర్య, కార్తిల మార్కెట్లు సాగాయి. వాళ్లని తెలుగు హీరోలుగానే భావించారు మన ప్రేక్షకులు. ఆ రోజుల్లో తెలుగు దర్శకులు కూడా సూర్య బ్రదర్స్‌తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించేవారు. త్రివిక్రమ్, పూరిలాంటి వాళ్లు – సూర్య కోసం కథలు సిద్ధం చేశారు. వినాయక్ కూడా కొంతకాలం సూర్య కోసం ఎదురుచూశాడు. సూర్య, కార్తిల ఆడియో ఫంక్షన్లు హైదరాబాద్‌లో జరుగుతుంటే, మన దర్శకుల హాజరు తప్పనిసరి.
అయితే అదంతా గతం. ఇప్పుడు ఈ బ్రదర్స్‌ని మనవాళ్లు పట్టించుకోవడంలేదు. వరుస ఫ్లాపులతో సూర్య, కార్తిల ఇమేజ్ డామేజీ అయ్యింది. తెలుగులో వీళ్ల సినిమా కొనడానికే ఎవ్వరూ ఉత్సాహం చూపించడం లేదు. అలాంటిది సినిమా ఎందుకు తీస్తారు? ఎవరు తీస్తారు? ఈమధ్య కార్తి ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించాడట. అయితే… సదరు దర్శకుడు కార్తిని లైట్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఆదివారం కార్తి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సమయంలో తెలుగు సినిమా ఎప్పుడు? అని ఓ పాత్రికేయుడు అడిగితే ‘కథ మీరు చెబుతారా?’ అంటూ కార్తి ఎప్పుడూ లేనంత వెటకారంగా సమాధానం చెప్పాడు. అంటే తెలుగు నుంచి కథలు చెప్పడానికి దర్శకులెవరూ ఉత్సాహం చూపించడం లేదనేగా..? ఇంచుమించుగా సూర్యదీ అదే పరిస్థితి. కార్తి కొత్త సినిమా ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో మన తెలుగు దర్శకులు అస్సలు కనిపించలేదు. ఆడియో ఫంక్షన్‌కి పిలిస్తేనే డుమ్మా కొట్టేస్తున్నారంటే, ఇక కథలు ఎలా తయారు చేస్తారు. సూర్య, కార్తిలు చెరో రెండు హిట్లు కొట్టి, మునుపటి ఫామ్‌లోకి వెళ్లిపోతే తప్ప, మళ్లీ వీళ్లకు పూర్వ వైభవం రాదు.