పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గంలో ఉప ఎన్నిక పూర్తయింది. ఈ ఉప ఎన్నికలో గెలవాలన్న పట్టుదలతో తెరాస, కాంగ్రెస్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్తమ్ ఇలాఖాలో కాంగ్రెస్ ను ఓడించాలన్న బలమైన పట్టుదలతో అన్ని రకాల మార్గాలనూ అధికార పార్టీ సమర్థంగా వినియోగించుకుందనే చెప్పాలి! మొత్తానికి, పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 85 శాతం మంది ఈ నియోజక వర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఎన్నికలకు ముందు హుజూర్ నగర్ ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఉన్నా… ఎన్నిక పూర్తయిన సాయంత్రానికే ఫలితంపై దాదాపు ఒక అంచనా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య ఫలితం దోబూచులాడుతుందనే సందిగ్ధం లేదు! ఈ ఉప ఎన్నిక తెరాసకు అనుకూలమైన ఫలితం ఉంటుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
సర్వే సంస్థలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించాయి. ఆరా సంస్థ సర్వేలో హుజూర్ నగర్లో తెరాసకు కి 50.48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కి 39.95 శాతం ఓట్లు పడతాయని తేల్చింది. తెరాస, కాంగ్రెస్ ల మధ్య దాదాపు 10 శాతం ఓట్లు తేడా ఉంటుందనేది ఆ సంస్థ అంచనా. మిషన్ చాణక్య సంస్థ తెరాసకు భారీ మెజారిటీ ఇచ్చింది. ఆ పార్టీకి 53 శాతం ఓట్లు పడ్డాయనీ, కాంగ్రెస్ పార్టీకి 41 శాతం పడ్డాయని చెప్పింది. ఈ అంచనా కూడా తెరాస కాంగ్రెస్ ల మధ్య పదిశాతంపైగా తేడా ఉండటం గమనార్హం. హోరాహోరీ ఏమీ లేదనేదే ఈ సర్వేల అంచనాలు. భాజపా, టీడీపీల ప్రభావం నామమాత్రమే అని తేల్చేశాయి.
కాంగ్రెస్ పార్టీ చివరివరకూ గట్టి పోటీయే ఇచ్చినా… పోల్ మేనేజ్మెంట్ లో కొంత వెనకబడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. చివరి మూడు రోజుల వరకూ కాంగ్రెస్ ప్రచారం బలంగా సాగినా… చివరి దశలో చెయ్యాల్సిన మేనేజ్మెంట్ లో తెరాసతో కాంగ్రెస్ పోటీ పడలేకపోయిందని అంటున్నారు! ఇక్కడే కాంగ్రెస్ సమర్థంగా నిర్వహించుకులేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మద్యం, సొమ్ము పంపిణీ, ఇతర ప్రలోభాలు చాలా తీవ్రంగా ఉన్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. చివరి మూడు రోజులూ అధికార పార్టీకి బాగా కలిసి వచ్చిందనీ, అధికార పార్టీని గెలిపించుకుంటే కొన్నైనా మంచి పనులు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని తెరాస బాగా తీసుకెళ్లిందని అంటున్నారు. కొన్ని సంస్థల సర్వేలు, ఇతర విశ్లేషణల నేపథ్యంలో వినిపిస్తున్న అభిప్రాయమైతే తెరాసకు అనుకూలంగా ఉందనేదే. అంతిమంగా ఓటరు ఎలాంటి తీర్పు ఇచ్చాడనేది మరో మూడ్రోజుల్లో వెల్లడౌ