భలే మంచి రోజుతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఆ తరవాత… శమంతణమణి తీశాడు. అది కూడా క్రైమ్ స్టోరీనే. ‘దేవదాసు’ తరవాత శ్రీరామ్ ఆదిత్య సినిమా ఒకటి పట్టాలెక్కుతోంది. గల్లా జయదేవ్ కుమారుడు ఈసినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి ఈ ప్రాజెక్టుకి దిల్ రాజు నిర్మాత. కానీ ఆయన ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో జయదేవ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. మదర్ సెంటిమెంట్ కూడా ఉందట. ‘కార్తీక దీపం’ సీరియల్‌లో అత్తగా నటించిన అర్చనని కథానాయిక తల్లి పాత్ర కోసం ఎంచుకున్నారు. కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక పూర్తయింది. త్వరలోనే టైటిల్‌తో సహా, ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారు.