గోపీచంద్‌కి ఏదీ కలసి రావడం లేదు. చేసిన సినిమాలు ఆగిపోతున్నాయి. వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చేయాల్సిన సినిమాలు జారిపోతున్నాయి. గోపీచంద్ మార్కెట్ ఎప్పుడో చిన్నాభిన్నం అయ్యింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాతలు భయపడుతున్నారు. ఇటీవలే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంపత్ నందితో ఓ సినిమా పట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వరకూ సినిమా ఉంటుందో లేదో కూడా తెలీదు.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో గోపీచంద్‌కి తేజ నుంచి అభయం వచ్చింది. గోపీచంద్ కోసం తేజ ఓ కథ సిద్ధం చేశాడట. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడట. గోపీచంద్ ఓకే అంటే.. ఈ కాంబో పట్టాలెక్కడం ఖాయం అనిపిస్తోంది. నిజంతో గోపీచంద్‌ని విలన్‌గా చూపించాడు తేజ. ఆ సినిమా గోపీచంద్ కెరీర్‌నే మార్చేసింది. హీరోగా సెటిల్ అవ్వడానికి దోహదం చేసింది. ఇప్పుడు మళ్లీ గోపీచంద్ కెరీర్‌ని ఓ గాడిలో పెట్టడానికి తేజ ముందుకు రావడం శుభపరిణామమే. మరి.. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.