‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తున్నారన్నమాట’
– పోకిరిలో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఇది. బహు బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పటికీ ఈ డైలాగ్‌ని సెటైరికల్‌గా వాడేస్తుంటారు.
మహేష్ కొత్త కమర్షియల్ యాడ్ చూసినా అదే డైలాగ్… అదే మాడ్యులేషన్లో చెప్పాలనిపిస్తుంది.
మహేష్ సినిమాల్లో తక్కువగా, కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువగా కనిపించే హీరో. తనకున్న డిమాండ్ అలాంటిది. మహేష్ అంటే… పేరు కాదు. ఓ బ్రాండ్ అయిపోయింది. మహేష్ యాడ్స్ అన్నీ స్టైలీష్‌గా, రిచ్‌గా తయారవుతుంటాయి. ఇప్పుడు మహేష్ నుంచి ఓ కొత్త యాడ్ వచ్చింది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ప్రకటన అది. ఈ యాడ్‌లో మహేష్ తోపాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా కనిపించారు.
మహేష్ కంప్లీట్ గా ఫ్యామిలీ మాన్. కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాడు. సినిమా లేకపోతే… వాళ్లతోనే ఉంటాడు. తొలిసారి తన కుటుంబ సభ్యులతో కలసి చేసిన యాడ్ ఇది. బహుశా.. తన కెరీర్లో బాగా ఎంజాయ్ చేస్తూ, నటించిన ప్రకటన కూడా ఇదేనేమో. ఎందుకంటే ఇక్కడ నటించాల్సిన అవసరం లేదు. తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో, అలా కనిపిస్తే చాలు. మహేష్, నమ్రత, గౌతమ్, సితారలను ఒకే ఫ్రేములో చూసిన ఘట్టమనేని అభిమానులు.. `ఇదో అపూర్వ ఘట్టం` అనేసుకుంటున్నారు. కాకపోతే.. ఈ యాడ్‌లో కృష్ణ కూడా ఉంటే బాగుండేది. మరింత నిండుదనం వచ్చేది. `మనం` సినిమాలా… ఓ నట కుటుంబం అంతా.. కలసి చేసిన సినిమా అయ్యేది. మూడు తరాలు తెరపై కనిపించేవి. ఈ ఐడియా మహేష్‌కి ఎందుకు రాలేదో..? ఈ యాడ్ కి కూడా సీక్వెల్ లాంటిదేమైనా ఉంటే, కనీసం అందులో అయినా ఆ పెద్దాయనని తీసుకొస్తే బాగుంటుంది.