సినీనటుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతితో సమావేశమయ్యారు. మహేష్ బాబు దత్తత తీసుకున్న సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. మిగిలిపోయిన పనులకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఇంత వరకూ బాగానే ఉంది. ప్రభుత్వం తరపున సహకారం కావాలంటే… ప్రభుత్వంలోని వారిని కలవాలి. కానీ.. వైఎస్ భారతిని కలవాల్సిన అవసరం ఏముందనేది… చాలా మందికి అర్థం కాని విషయం. తన భర్త ముఖ్యమంత్రి అయినందున.. వైఎస్ భారతి కూడా అధికార విధుల్ని పంచుకుంటున్నారా…అనే ప్రశ్న వస్తోంది.
బుర్రిపాలెంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే… సంబంధిత అధికారులు.. లేకపోతే మంత్రి… లేకపోతే.. స్థానిక ఎమ్మెల్యే.. ఇంకా పలుకుబడి ఉంది కాబట్టి… ముఖ్యమంత్రిని కలిసినా రీజనబుల్ గా ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి సతీమణని కలిసి ప్రభుత్వ సహకారం కోరడమే ఎబ్బెట్టుగా ఉంది. బుర్రిపాలెం విషయంలో మహేష్ బాబు… పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి… ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి పనులు చేస్తున్నారు. కానీ కొత్త ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఆగిపోయిందని చెబుతున్నారు. మధ్యలో ఉన్న పనుల్ని… పూర్తి చేయడానికి స్వయంగా నమ్రతనే విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మహేష్ బాబు నేరుగా వచ్చి కలవలేరు కాబట్టి… నమ్రత … భారతీతో చెప్పి పనులు పూర్తి చేసుకోవాలనుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలో మంత్రులను కూడా పని చేయనివ్వడం లేదని.. అంతా జగన్ బంధువుర్గమే.. వ్యవహారాలు చక్కబెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో… బుర్రిపాలెం అభివృద్ధి పనుల్లో.. ఇబ్బందుల్లాంటి వాటి విజ్ఞప్తులు స్వీకరించే బాధ్యత జగన్ సతీమణి తీసుకున్నట్లున్నారే విమర్శలు ప్రారంభమయ్యాయి.