వాస్తవానికి హర్యానాలో బీజేపీ ఓడిపోయింది. మెజార్టీకి ఆరు సీట్ల దూరంలో ఆగిపోయింది. కానీ అక్కడ ప్రభుత్వం ఏర్పడుతోంది. కొత్త మిత్రపక్షం అండతో… చకచకా రెండో సారి ఖట్టర్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కానీ.. ఎన్నికలకు ముందే.. జట్టుగా పోటీ చేసి… విజయం సాధించిన మహారాష్ట్రంలో మాత్రం.. బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చేజారిపోతుందా.. అనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. శివసేన. ధాకరే కుటుంబం నుంచి..ఓ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం వచ్చిందని.. దాన్ని వదులుకోకూడదని.. శివసేన పెద్దలు పట్టుదలతో ఉన్నారు. ఫలితంగా… పీట ముడి పడిపోయింది. బాల్ ధాకరే మనవడు.. ఆదిత్య ధాకరే ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. గట్టిగా 30ఏళ్లు కూడా లేని ఆదిత్యను సీఎంను చేసి.. బాల్ థాకరే కలను నెరవేర్చాలని ఉద్దన్ ధాకరే కోరుకుంటున్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే… 145 సీట్లు కావాలి. కానీ బీజేపీకి సొంతంగా లభించింది 103 సీట్లు మాత్రమే. అంటే.. కచ్చితంగా శివసేనపై ఆధారడాల్సిందే. అందుకే శివసేన పట్టు బిగించింది. తమకు సీఎం పీఠం ఇవ్వాలంటోంది. ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదనే వాదన కూడా వినిపిస్తోంది. తాము మొత్తం ఐదేళ్ల పాటు..సీఎం పదవి కోరుకోవడం లేదని.. .ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఫార్ములాను ప్రతిపాదిస్తోంది.రెండున్నరేళ్ల పాటు..తమకు సీఎం పీఠం ఇవ్వాలని కోరుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. గట్టిగానే వాదిస్తున్నారు. అమిత్ షా వచ్చి..ఈ హామీ ఇచ్చిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని… ధాకరేల నివాసం.. మాతో శ్రీ నుంచి స్పష్టమన సూచనలు.. బీజేపీకి వెళ్లాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో బాల్ ధాకరే ..వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. శివసేన పార్టీతో.. ఒకప్పుడు మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించారు. అయితే.. బీజేపీతో పొత్తు కారణంగా పూర్తి స్థాయిలో ఎదగలేకపోయింది. ఒకప్పుడు.. బీజేపీ చిన్న పార్టీ.. శివసేన పెద్ద పార్టీగా ఉండేది. రాను రాను.. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్వవైభవం తెచ్చుకోవాలని ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. శివసేన పార్టీతో… మహారాష్ట్ర రాజకీయాల్ని శాసించినా.. ఇప్పటి వరకూ.. థాకరేల కుటుంబం నుంచి ఎవరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలి సారి ఉద్దవ్ ధాకరే రంగంలోకి దిగి గెలిచారు. గెలిచిన తొలి సారే.. సీఎంను చేయాలనే పట్టుదలతో.. తండ్రి ఉద్దవ్ ఉన్నారు. ఆ ప్రయత్నం ఫలిస్తుందో… అమిత్ షా వ్యూహాల ముందు తేలిపోతుందో.. వేచి చూడాల్సిందే..!