24వ తేదీన చిరంజీవి, రామ్‌చరణ్‌కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. ఆ రోజున ఆయన సైరా సినిమా చూస్తారు అంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని.. మోడీ అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పుకోవడంతో ఇదంతా నిజమేనని అనుకున్నారు. కానీ ఇరవై నాలుగో తేదీ వచ్చింది.. పోయింది. కానీ.. భేటీ మాత్రం జరగలేదు. ఆ తర్వాత కూడా.. దీనిపై ఎలాంటి వార్తలు లేవు. దాంతో.. అదంతా.. ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇప్పుడు.. సైరా సినిమా సందడి పూర్తిగా తగ్గిపోయింది. ఫేడవుట్ అయిపోయిన సినిమా గురించి.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ అగడం… దానికి పీఎంవో ఓకే చేయడం సాధ్యమయ్యే పని కాదు.
నిజానికి 24వ తేదీన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఉంది. ఆ రోజు.. నరేంద్రమోడీ తీరిగ్గా… సైరా సినిమా చూస్తారని ఊహించలేం. రాజకీయ పరిణామాల నేపధ్యంలో.. మోడీ చాలా బిజీగా ఉంటారు. ఈ చిన్న లాజిక్ ను పట్టుకుని ఉంటే… ఆ రోజు.. చిరంజీవి, రామ్‌చరణ్‌లకు మోడీ అపాయింట్మెంట్ ఖరారయిందో.. లేదో.. క్రాస్ చెక్ చేసుకుని ఉండేవారు. కానీ.. వెంకయ్యనాయుడు కూడా.. సినిమా చూసినందున.. ఇక మోడీనే చూడాల్సిందన్నట్లుగా.. ఆయన కూడా ఉత్సాహం చూపిస్తారన్నట్లుగా.. చిరంజీవిపై అమితమైన అభిమానంతో కొందరు.. ప్రచారం చేయడంతో.. తీరా ఇప్పుడు… కవర్ చేసుకోవడానికి తంటాలు పడాల్సిన పరిస్థితి.
మోడీ అపాయింట్మెంట్ కోసం చిరంజీవి ప్రయత్నించిన మాట నిజం. వెంకయ్యనాయుడుకి.. ఢిల్లీలో సైరా స్పెషల్ షో వేసినప్పుడే..మోడీ అపాయింట్మెంట్ ఖరారయిందని అనుకున్నారు. కానీ… సాధ్యం లేదు. అప్పట్నుంచి.. మోడీ కార్యాలయం నుంచి పిలుపు వస్తుందని.. సైరా బృందం ఎదురు చూస్తోంది. కానీ ఇప్పటికీ పిలుపు రాలేదు. ఈ లోపు మోడీ దక్షిణాది తారలపై వివక్ష చూపుతున్నారని విమర్శిస్తూ… చిరంజీవి కోడలు ఉపాసన ఓ ట్వీట్ చేశారు. ఇది కూడా.. మోడీ అపాయింట్ మెంట్… ఆలస్యం అవడానికి కారణమై ఉండవచ్చని.. ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఏదైనా… సైరాను ఇప్పటి వరకూ.. మోడీ కలవాలనుకోలేదు.