రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లుగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు.ఈ మేరకు టీడీపీ అధినేతకు.. రాజీనామాలేఖ పంపారు. తెలుగుదేశం పార్టీతో పాటు… ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా.. రాజీనామా చేస్తున్నట్లుగా వంశీ లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు లేఖలో చంద్రబాబుకు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేర్చానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు, అధికారులు ఎన్ని కుట్రలు చేసినా.. అతి కష్టం మీద గెలిచానన్నారు. కొన్ని రోజులుగా.., తనపై.. తన అనుచరులపై పెరుగుతున్న వేధింపులతో…ఇబ్బంది పడుతున్నామన్నారు. అనుచరులను ఇబ్బంది పెట్టలేక తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు.
వల్లభనేని వంశీ రెండు రోజుల కిందట… సీఎం జగన్ ను కలిశారు. ఆయన వైసీపీలో చేరబోతున్నారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. వ్యూహాత్మకంగా.. టీడీపీకి రాజీనామా చేయించి… తటస్థ సభ్యునిగా.. అసెంబ్లీలో కొనసాగించే వ్యూహాన్ని వైసీపీ అమలు చేయబోతోందని.. ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే వల్లభనేని వంశీ… టీడీపీకి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లుగా ప్రకటించారు. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. అయితే.. వంశీ మరో లేఖను స్పీకర్ కు పంపుతారో.. లేదోనన్నదానిపై ఇంకా క్లారిటీలేదు. స్పీకర్ కు పంపినా.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే మాత్రం.. వైసీపీతో కలిసి వ్యూహాత్మకంగా.. ఈ అడుగులు వేస్తున్నారని భావింవచ్చని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.
కేసుల విషయంలో వల్లభనేని వంశీ.. చాలా కాలంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. నకిలీ పట్టాల కేసు కూడా.. కొద్ది రోజుల కిందట నమోదయింది. అది అక్రమ కేసని… కొద్ది రోజులుగా ఆయన వాదిస్తున్నారు. ఈ క్రమంలో.. అటు సుజనా చౌదరితోనూ.. ఇటు జగన్ తోనూ.. సంప్రదింపులు జరిపారు. చివరికి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ.. ఇది వ్యూహాత్మక అడుగేనని.. ఆయన వైసీపీకి సన్నిహితంగా ఉండటం ఖాయమని.. ఆయన వర్గీయులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీలో వంశీ చేరేందుకు గన్నవరం వైసీపీ క్యాడర్ వ్యతిరేకతతో ఉంది.