ఆంధ్రప్రదేశ్లో విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు రాజకీయ వేధింపులతో కొంత మంది.. పనుల్లేక పస్తులుండలేక మరికొంత మంది వీడియో వాంగ్మూలాలు ఇచ్చి మరీ ప్రాణఆలు తీసుకుంటుంన్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు రోజుకొకరు చొప్పున ఆత్మహత్య చేసుకుంటున్న విషయం బయట పడుతోంది. ఇప్పటికి నలుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇసుక కొరత వల్ల పనుల్లేక కుటుంబాన్ని పోషించలేక గుంటూరు జిల్లాలోనే ఎక్కువగా ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాపీమేస్త్రీ నాగబ్రహ్మం, వెంకట్రావు, మరో ప్లంబర్ మూడు రోజుల వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్నారు.
నాలుగు నెలలుగా పనుల్లేకపోవడంతో… కుటుంబాన్ని పోషించలేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. భార్య పిల్లలను పోషించలేకపోతున్నానన్న మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇసుక కొరతతో పనుల్లేక… కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని… అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి ఆత్మహత్య విషయంలో పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యలకు కారణమమని స్టేట్మెంట్ ఇవ్వాలని.. పోలీసులే బాధిత కుటుంబసభ్యులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రస్తుతం సమస్యను గుర్తించడానికి కూడా సిద్ధపడలేదు. ఐదు నెలల క్రితం అధికారం చేపట్టిన ప్రభుత్వం వచ్చీ రాగానే.. ఎకనామిక్ యాక్టివిటీని నిలిపేసింది.
నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిపేసింది. ఏపీలో ఇప్పుడు.. ప్రభుత్వం తరపున ఒక్క పనీ జరగడం లేదు. ఇసుక సరఫరాని నిలిపివేసి.. బ్లాక్ మార్కెట్ గాళ్లకు.. అనధికారికంగా.. రాసిచ్చేయడంతో.. వారు చెప్పిందే వేదంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను సృష్టించిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలతో తమకు పనేమీ లేనట్లుగా ఉంటోంది.