118తో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు కల్యాణ్ రామ్. అదో థ్రిల్లర్. గుహన్ దర్శకత్వం వహించారు. వెంటనే ఫ్యామిలీ కథకు షిఫ్ట్ అయిపోయి… సతీష్ వేగేశ్నతో `ఎంత మంచివాడవురా` చేస్తున్నాడు. ఈ సినిమా అవ్వగానే మళ్లీ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. 118ని నిర్మించింది ఈ సంస్థే. అయితే ఈ సినిమాకి దర్శకుడెవరన్నది చెప్పలేదు. కానీ… ఈ సినిమాకీ గుహన్నే దర్శకుడిగా ఎంచుకున్నాట్టు టాక్. ‘118’ సమయంలోనే గుహన్ కల్యాణ్ రామ్‌కి మరో కథ చెప్పాడట. అది కూడా నచ్చేసింది. ఇప్పుడు ఆ కథనే పట్టాలెక్కించబోతున్నట్టు టాక్. ‘118’ విజయరహస్యం.. దాన్ని ఫుల్ ప్యాక్డ్ బడ్జెట్లో తెరకెక్కించడం. అనుకున్న బడ్జెట్‌కి రూపాయి అటూ ఇటూ అవ్వకుండా చూసుకున్నారు. కల్యాణ్ రామ్ మార్కెట్ మీటర్ పరిధిలోనే సినిమా పూర్తవ్వడం వల్ల కలిసొచ్చింది. ఈసారీ అదే ప్లానింగ్‌తో ఉన్నారు దర్శక నిర్మాతలు. అన్నట్టు ఇది కూడా ఓ థ్రిల్లరే అని టాక్. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.