రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులోకథానాయికగా శ్రుతిహాసన్ పేరు ముందు నుంచీ వినిపిస్తూ వుంది. అయితే శ్రుతి అవుడ్డేటెడ్ అయిపోయిందని, తెలుగు సినిమాలపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందని, కాంబినేషన్ కూడా ఓల్డ్ గా కనిపిస్తుందని.. రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే చిత్రబృందం ఇవేమీ పట్టించుకోలేదు. శ్రుతిహాసన్నే రంగంలోకి దించారు. ఈ సినిమాలో కథానాయికగా ఆమెనే ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన `బలుపు`లోనూ శ్రుతినే కథానాయిక. ఓ రకంగా ఇది `బలుపు 2` అన్నమాట. ఇందులో రవితేజ ఓ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి `క్రాక్` అనే పేరు పరిశీలనలో ఉంది.