రాజకీయాల్లో ఎవరూ పునీతులు కాదంటూ.. శివసేన మహారాష్ట్రలో డిఫరెంట్ కాంబినేషన్‌కు ప్రయత్నిస్తోంది. సీఎం సీటును సగం సగం పంచుకోవాల్సిదేనంటూ.. కండిషన్ పెట్టి.. ఏ మాత్రం వెనక్కి తగ్గని శివసేన… ఇప్పుడు కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి మద్దతిస్తున్నాయంటూ.. ప్రకటనలు కూడా చేస్తోంది. అయితే బీజేపీ మాత్రం సీఎం కుర్చీ చెరి రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలన్న డిమాండ్‌ను అంగీకరించడంలేదు. దీంతో శివసేన శాసనసభా పక్ష సమావేశంలో కాషాయ దోస్తీని పక్కనపెట్టేందుకు కూడా తాము రెడీ అన్న రీతిలో ఆయన చేసిన కామెంట్స్ చేశారు. బీజేపీ తప్పుకున్నా.. తమకు వేరే దారులు ఉన్నాయని ఉద్ధవ్ ఠాక్రే సంకేతాలు ఇచ్చారు. శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు.
ఈసారి శివసైనికుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని చెబుతున్నారు. అయితే ఓ వైపు బీజేపీ కుర్చీని పంచుకునేది లేదని చెబుతున్నా.. శివసేన మాత్రం అది తమ హక్కు అని చెబుతోంది. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పదవులన్నింటినీ చెరి సగం పంచుకుంటామని లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్‌షా చెప్పారు. ఆ ప్రెస్‌మీట్ సమయంలో ఫడ్నవీస్ కూడా అక్కడే ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే అంటున్నారు. ప్రభుత్వ పదవులంటే సీఎం పదవి కూడా వస్తుందంటున్నారు. బీజేపీ ఒప్పుకోకుంటే.. సొంతంగా ముందుకు సాగాలన్నట్లుగా ఉద్ధవ్ ఠాక్రే వైఖరి కనిపిస్తోంది.
బీజేపీకి ఝులక్ ఇవ్వడానికి కాంగ్రెస్ – ఎన్సీపీ కూడా రెడీగా ఉన్నాయి. శివసేన సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. బయట నుంచి మద్దతిచ్చే అవకాశాలను కూడా ఆ పార్టీ పరిశీలిస్తోంది. అయితే.. శివసేన.. తమను ఉపయోగించుకుని.. బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తోందన్న సందేహం వారికి ఉంది. అందుకే.. ఎక్కువగా.. ఈ విషయంలో.. కాంగ్రెస్ – ఎన్సీపీ ఇన్వాల్వ్ కావడం లేదు. రానున్న రోజుల్లో నాటకీయ పరిణామాలు ఖాయమన్న ప్రచారం మాత్రం జరుగుతోంది.