తెలంగాణ సీఎం కేసీఆర్… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆయనే కాదు… మంత్రి కేటీఆర్.. ఎంపీ కేశవరావు కూడా పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఆసక్తి చూపించలేదు. వారు కూడా… అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణే చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికుల తరపున … కేసీఆర్ తో మాట్లాడతానని… పవన్ కల్యాణ్.. తనను కలిసిన యూనియన్ నేతలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కేసీఆర్, కేటీఆర్ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నించారు. ఆర్టీసీ విషయంలో.. ఎవరితోనూ..కేసీఆర్ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. తనే స్వయంగా వ్యవహారం మొత్తం డీల్ చేస్తున్నారు. ఏం చేయాలి..? ఎలా చేయాలనేది.. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ అడిగినంత మాత్రాన.. అపాయింట్ మెంట్ ఇచ్చి.. మాట్లాడతారని ఎవరూ అనుకోలేదు. అదే జరిగింది. అయితే.. కేటీఆర్, కేశవరావు కూడా.. పవన్ ను లైట్ తీసుకోవడమే ఆశ్చర్యకరం. గతంలో ఏపీ రాజకీయ పరిణామాల్లో కీలకమైన మార్పుల కోసం చూస్తున్న సమయంలో.. టీడీపీకి.. పవన్ కల్యాణ్ ను వ్యతిరేకంగా మార్చాలన్న వ్యూహంలో భాగంగా… కేసీఆర్ ఓ సారి.. పవన్ కల్యాణ్ ను ప్రగతి భవన్ కు ఆహ్వానించారు. పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడారు. భోజనం పెట్టి పంపించారు. ఆ చనువుతో.. కేసీఆర్ తనకు అడిగినప్పుడల్లా అపాయింట్ మెంట్ ఇస్తారని పవన్ కల్యాణ్ భావించినట్లున్నారు.
గతంలో… ఉత్తరాంధ్ర బీసీ కులాలను.. బీసీ కేటగిరి నుంచి తొలగించిన విషయంపైనా కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పారు. అలాగే.. మరికొన్ని అంశాలపైనా కేసీఆర్ తో మాట్లాడతానని చెప్పారు. కానీ.. ఆ తర్వాత .. ఒకటి , రెండు సార్లు నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు.. రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమంలో కలుసుకోవడం తప్ప… ఎప్పుడూ పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కేసీఆర్. ఈ విషయాన్ని అంచనా వేయకుండా… తాను కేసీఆర్ తో మాట్లాడతానని ప్రకటించేశారు. చివరికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని.. వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Not favourable… still make efforts! -JanaSena Chief @PawanKalyan pic.twitter.com/uB2ZR3VFe3
— JanaSena Party (@JanaSenaParty) November 1, 2019