నందమూరి బాలకృష్ణ, .. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాకి రెడీ అవుతున్నారు. డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమా కూడా లైన్ లో వుంది. అదే బోయపాటిది. బాలయ్య, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. సింహా, లెజెండ్ తో హిట్లు కొట్టిన ఈ జోడి హ్యాట్రిక్ కి రెడీ అవుతుంది. 2020 జనవరిలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసేశాడు. అయితే ఇప్పుడీ సినిమాకి సంబధించిన తాజా సమాచారం ఏమిటంటే.. ఇదో ఫ్యామిలీ డ్రామా. అంటే.. కంప్లీట్ ఫ్యామిలీ అని కాదు.. బోయపాటి మార్క్ తో సాగే ఫ్యామిలీ సబ్జెక్ట్.
ముఖ్యంగా ఇందులో పొలిటికల్ కంటెంట్ అస్సల్ వుండదట. సింహా, లెజెండ్ సినిమాల్లో పొలిటికల్ టచ్ వుంది. ”రాజకీయం మా బ్లడ్ లో వుంటుంది” ”సీటు… అసెంబ్లీ గేటు” ఇలా పొలిటికల్ పంచ్ లు వేసిన బాలయ్య .. కొత్త సినిమాలో వీటిని పూర్తిగా దూరం పెట్టేయాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి కారణం.. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు. ఈ ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు బాలయ్య. ఇలాంటి సమయంలో పొలిటికల్ టచ్ అనవసరమని అటు బోయపాటి ఇటు బాలయ్య ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. అందుకే మాంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఓ ఫ్యామిలీ డ్రామాని సెట్ చేశారట. దీనికి టైటిల్ కూడా సింహా, లెజెండ్ లా హెవీగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా వుండే పేరునే పరిశీలిస్తున్నారు.